న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ ఐపీవోకు స్పందన భేష్‌!

న్యూజెన్‌ సాఫ్ట్‌వేర్‌ ఐపీవోకు స్పందన భేష్‌!

ఢిల్లీ కేంద్రంగా ఐటీ సేవలందించే న్యూజెన్ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ చివరిరోజు గురువారానికి(18న) 8.2 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఐపీవోకు ధరల శ్రేణి రూ. 240-245కాగా.. తద్వారా రూ. 424 కోట్లను సమీకరించాలని కంపెనీ భావించింది. ఇష్యూలో భాగంగా 1.34 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచడంతోపాటు రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను న్యూజెన్‌ తాజాగా జారీ చేయనుంది. 

బిడ్స్‌ తీరిదీ
ఐపీవోలో భాగంగా కంపెనీ విక్రయానికి ఉంచిన 1.22 కోట్ల షేర్లకుగాను మొత్తం 10 కోట్ల షేర్లకు బిడ్స్‌ దాఖలయ్యాయి. అంటే 8.22 రెట్లు అధికంగా స్పందన లభించింది. అర్హతగల సంస్థాగత ఇన్వెస్టర్ల(క్విబ్‌) కోటాలో దాదాపు 16 రెట్లు, సంపన్న వర్గాల విభాగం నుంచి 5.5 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలయ్యాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లు సైతం 5 రెట్లు అధికంగా దరఖాస్తు చేయడం విశేషం!

యాంకర్‌ నిధులు!
సోమవారం(15న) న్యూజెన్‌ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 127 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 245 ధరలో 9 యాంకర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలకు దాదాపు 52 లక్షల షేర్లను కేటాయించింది.Most Popular