అమెరికా మార్కెట్ల నేలచూపు!

అమెరికా మార్కెట్ల నేలచూపు!

బుధవారం భారీగా లాభపడ్డ అమెరికా స్టాక్ మార్కెట్లు గురువారం వెనకడుగు వేశాయి. డోజోన్స్‌ 98 పాయింట్లు తిరోగమించి 26,018 వద్ద ముగియగా.. ఎస్‌అండ్‌పీ 4 పాయింట్లు తగ్గి 2,798 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ సైతం 75 పాయింట్లు(1 శాతం) పురోగమించి 7,298 వద్ద ముగిసింది. బుధవారం మార్కెట్‌ చరిత్రలో తొలిసారి డోజోన్స్‌ 26,000 పాయింట్ల మైలురాయినీ, ఎస్‌అండ్‌పీ 2,800 స్థాయినీ దాటి నిలిచిన సంగతి తెలిసిందే! కాగా గురువారం డోజోన్స్‌ ఒక దశలో 168 పాయింట్ల వరకూ పతనమైంది. ఎస్‌అండ్‌పీ సైతం లాభనష్టాల మధ్య ఊగిసలాడింది. ఇంజినీరింగ్ దిగ్గజం జనరల్‌ ఎలక్ట్రిక్‌ అమ్మకాలతో బలహీనపడింది. 2011 డిసెంబర్‌ తరువాత 17 డాలర్ల దిగువకు చేరంది.Most Popular