భారతి ఎయిర్టెల్ నికర లాభంలో 39 శాతం క్షీణత

భారతి ఎయిర్టెల్ నికర లాభంలో 39 శాతం క్షీణత

భారతి ఎయిర్టెల్ మరోసారి నిరుత్సాహపరిచింది. వరుసగా తొమ్మిదో క్వార్టర్లో నిరాశాజనకమైన ఫలితాలను ప్రకటించిన మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. మూడో త్రైమాసికంలో నికర లాభంలో 39 శాతం క్షీణతను నమోదు చేసింది. రిలయన్స్ జియో దెబ్బకు ఇంటర్‌కనెక్ట్ యూసేజ్ ఛార్జీలు దారుణంగా పడిపోవడం, వాయిస్ - డేటా రేట్లలో గణనీయమైన పతనం సంస్థ ఆదాయాన్ని దెబ్బతీసింది. 

గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.504 కోట్ల లాభాన్ని నమోదు చేసిన సంస్థ ఈ సారి రూ.306 కోట్లకు పరిమితమైంది. ఆదాయం కూడా 19 శాతం కోల్పోయి రూ.20319 కోట్లుగా నమోదైంది. 

అయితే బ్రాడ్‌బాండ్ సేవల వ్యాపారంలో అనూహ్యమైన వృద్ధిని నమోదు చేసినట్టు సంస్థ చెబ్తోంది. రాబోయే రోజుల్లో ఇది మరింత విస్తరించనుంది ఎయిర్టెల్ ధీమాగా ఉంది. 

నిరుత్సాహక ఫలితాలతో ఎయిర్టెల్ షేర్ శుక్రవారం రోజున ప్రభావితమయ్యే అవకాశాలున్నాయి. 
Airtel 495.00 -4.90 (-0.98%)Most Popular