మార్కెట్ల రికార్డ్స్‌ పర్వం- చిన్న షేర్లు పతనం!

మార్కెట్ల రికార్డ్స్‌ పర్వం- చిన్న షేర్లు పతనం!

ఇటీవల ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న బ్యాంకింగ్‌ రంగ అండతో దేశీ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజు కొత్త రికార్డులు సాధించాయి. తొలుత సెన్సెక్స్‌ సాంకేతికంగా కీలకమైన 35,500 మార్క్‌ను అందుకోగా.. నిఫ్టీ 10,887 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. చివరికి సెన్సెక్స్‌ 178 పాయింట్లు ఎగసి 35,260 వద్ద నిలవగా.. 28 పాయింట్లు జమచేసుకున్న నిఫ్టీ 10,817 వద్ద స్థిరపడింది. ఇవి కూడా సరికొత్త గరిష్టాలు కావడం విశేషం!!
చిన్న షేర్లు బోర్లా
బాగా వేడెక్కిన మార్కెట్లలో మిడ్ సెషన్‌ నుంచీ అమ్మకాలు ప్రారంభంకావడంతో ఒక దశలో నిఫ్టీ లాభాలను కోల్పోయి 5 పాయింట్ల నష్టానికిసైతం లోనయ్యింది. ఈ బాటలో బీఎస్ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు చివరికి 2 శాతం చొప్పున పతనమయ్యాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 2,248 డీలాపడగా.. 707 మాత్రమే లాభపడ్డాయంటే అమ్మకాల తీవ్రతను అర్ధం చేసుకోవచ్చు.
రియల్టీ, మెటల్‌ పతనం
ఎన్‌ఎస్‌ఈలో ప్రయివేట్‌ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ 1 శాతం చొప్పున లాభపడటం ద్వారా మార్కెట్లకు అండగా నిలిచాయి. అయితే రియల్టీ, మెటల్‌ 4-3 శాతం చొప్పున తిరోగమించాయి. ఫార్మా సైతం 1 శాతం నీరసించడం గమనార్హం.
బ్లూచిప్స్‌లో 
నిఫ్టీ దిగ్గజాలలో ఐటీసీ, ఐబీ హౌసింగ్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కొటక్ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్, టీసీఎస్, యస్‌బ్యాంక్‌ 3-1 శాతం మధ్య ఎగశాయి. అయితే మరోవైపు ఇన్‌ఫ్రాటెల్‌ 6 శాతం కుప్పకూలింది. హిందాల్కో, అదానీ పోర్ట్స్‌, టాటా స్టీల్‌, వేదాంతా, అల్ట్రాటెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌పీసీఎల్‌, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌ 3.5-2 శాతం మధ్య పతనమయ్యాయి.
రెండువైపులా కొనుగోళ్లు
నగదు విభాగంలో బుధవారం  విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 625 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) దాదాపు రూ. 169 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. గత రెండు ట్రేడింగ్‌ సెషన్లలో ఎఫ్‌పీఐలు రూ. 720 కోట్లను ఇన్వెస్ట్‌చేయగా... దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 421 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే.Most Popular