రియల్టీ, మెటల్స్‌ బోర్లా- మార్కెట్ల వెనకడుగు!

రియల్టీ, మెటల్స్‌ బోర్లా- మార్కెట్ల వెనకడుగు!

ప్రధానంగా రియల్టీ, మెటల్‌ రంగాలలో భారీ అమ్మకాలు చోటుచేసుకోవడంతో మార్కెట్లు చివరిలో కంగుతిన్నాయి. నిఫ్టీ అయితే లాభాలను పోగొట్టుకోవడమేకాకుండా 5 పాయింట్ల వరకూ నష్టపోయి 10,782 వద్ద కనిష్టాన్ని తాకింది కూడా. ఆపై వెనువెంటనే కోలుకుని ప్రస్తుతం 16 పాయింట్ల లాభంతో 10,805 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 136 పాయింట్ల లాభంతో 35,218 వద్ద కదులుతోంది.
ఇదీ పతన తీరు
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ, మెటల్‌ దాదాపు 4 శాతం చొప్పున పతనమయ్యాయి. రియల్టీ షేర్లలో హెచ్‌డీఐఎల్‌, యూనిటెక్‌, డీఎల్‌ఎఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, శోభా, ఇండియాబుల్స్‌, ప్రెస్టేజ్‌, ఒబెరాయ్, బ్రిగేడ్‌, ఫీనిక్స్‌ 6.5-2 శాతం మధ్య పతనమయ్యాయి. మెటల్‌ షేర్లలో నాల్కో, ఎంవోఐఎల్‌, సెయిల్‌, హింద్‌ జింక్‌, హింద్‌ కాపర్‌, ఎన్‌ఎండీసీ, కోల్‌ ఇండియా, హిందాల్కో, వేదాంతా, టాటా స్టీల్‌, జిందాల్‌ స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 6-2.5 శాతం మధ్య తిరోగమించాయి.Most Popular