యాంబర్‌ ఐపీవో తొలి రోజే సక్సెస్‌

యాంబర్‌ ఐపీవో తొలి రోజే సక్సెస్‌

పంజాబ్‌ కేంద్రంగా 1990లో ఏర్పాటైన యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పబ్లిక్‌ ఇష్యూ బుధవారం(17న) ప్రారంభమైంది 19న(శుక్రవారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 855-859కాగా..  తద్వారా కంపెనీ రూ. 600 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. బుధవారం తొలి రోజే ఇష్యూ పూర్తిస్థాయిలో సబ్‌స్క్రయిబ్‌ కావడం విశేషం. ఇష్యూలో భాగంగా కంపెనీ 49.27 లక్షల షేర్లను విక్రయానికి ఉంచగా.. 50.93 లక్షల షేర్ల కోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. మంగళవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ దాదాపు రూ. 179 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 859 ధరలో 15 సంస్థలు కంపెనీలో ఇన్వెస్ట్‌ చేశాయి. వీటిలో అబుధబీ ఇన్వెస్ట్‌మెంట్‌, గోల్డ్‌మన్‌ శాక్స్‌, బ్లాక్‌రాక్‌ ఇండియా తదితరాలున్నాయి.

17 షేర్లు ఒక లాట్‌
రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 17 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే ఇవే గుణిజాల్లో ఏక మొత్తంగా రూ. 2 లక్షలకు మించకుండా అప్లై చేసుకోవచ్చు. షేర్లు బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈలలో లిస్ట్‌కానున్నాయి. ఐపీవో నిధులను రుణాల చెల్లింపులు, సాధారణ కార్పొరేట్‌ వ్యవహారాలకు వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది.

కంపెనీ వివరాలివీ
ప్రధానంగా ఎయిర్‌ కండిషనర్ల తయారీలో యాంబర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కార్యకలాపాలు కలిగి ఉంది. కంపెనీ కస్టమర్లలలో మార్కెట్లో సుప్రసిద్ధ కంపెనీలు డాయికిన్‌, హిటాచీ, ఎల్‌జీ, ప్యానసోనిక్‌, వోల్టాస్‌, వర్ల్‌పూల్‌ తదితరాలుండటం విశేషం! కస్టమర్ల తరఫున పూర్తిస్థాయిలో రూమ్‌ ఎయిర్‌కండిషనర్ల డిజైన్‌, తయారీలను యాంబర్‌ చేపడుతోంది. మార్కెట్లో విక్రయమయ్యే టాప్‌-10 బ్రాండ్ల స్ప్లిట్‌ ఏసీలలో ఎనిమిదింటిని కంపెనీయే తయారు చేస్తోంది.Most Popular