ఈ మిడ్‌క్యాప్స్‌పై ఫండ్ మేనేజర్స్ కన్నేశారు.. మీరు?!

ఈ మిడ్‌క్యాప్స్‌పై ఫండ్ మేనేజర్స్ కన్నేశారు.. మీరు?!

గత ఏడాది కాలంలో మిడ్‌క్యాప్ రంగంలోని స్టాక్స్ మంచి రాబడులనే అందించినా, ప్రస్తుతం ఇవి ఎక్స్‌పెన్సివ్‌గా కనిపిస్తున్నాయి. ఇది ఇన్వెస్టర్లను ఆలోచనలో పడేసే విషయంగా చెప్పవచ్చు. అయితే, ఫండ్ మేనేజర్లు మాత్రం మిడ్‌క్యాప్‌లో ఉన్న అవకాశాలను ఇంకా పరిశీలిస్తూనే ఉన్నారు. డైవర్సిఫైడ్ కంపెనీలను ఎంచుకుంటున్నారు. ఒక సెక్టార్‌లోనే పలు విభాగాలకు చెందిన కార్యకలాపాలు అందిస్తున్న కంపెనీలపై వీరు అనుసరిస్తున్న వ్యూహాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. లీడింగ్ ఫండ్ హౌస్‌లు పెట్టుబడులు చేస్తున్న కొన్ని మిడ్‌క్యాప్ కంపెనీల వివరాలను చూద్దాం.

 

ఏపీఎల్ అపోలో ట్యూబ్స్

 • ప్రస్తుత ధర: రూ. 2,292 
 • మార్కెట్ క్యాప్: రూ. 5,439 కోట్లు
 • బయ్యర్: కోటక్ మ్యూచువల్ ఫండ్

మౌలిక రంగంపై కేంద్రం దృష్టి నిలపడం, పలు రంగాలలో సంస్కరణలు చేపట్టడం వంటివి.. ఎలక్ట్రిక్ రెసిస్టెన్స్ వెల్డెడ్ స్టీల్ పైప్స్ విభాగంలో డిమాండ్ పెంచాయి. రాబోయే 4-5 ఏళ్ల పాటు ఈ డిమాండ్ పెరుగుదల కనీసం 10 శాతంగా ఉండవచ్చని అంచనా. దేశీయ ఈఆర్‌డబ్ల్యూ ఇండస్ట్రీలో ఏపీఎల్‌కు 15 శాతం మార్కెట్ వాటా ఉంది. డీలర్స్ నెట్వర్క్ భారీగా ఉండడం, బ్రాండ్ విలువ ఈ కంపెనీకి దోహదం చేసే అంశాలు. దేశీయ అమ్మకాలతో పాటు 20 దేశాలకు ఏపీఎల్ అపోలో ఎగుమతులు చేస్తుంది.

 

గ్రీన్‌ప్లై

 • ప్రస్తుత ధర : రూ. 378 
 • మార్కెట్ క్యాప్: రూ. 4,635 కోట్లు 
 • బయ్యర్: రిలయన్స్ మ్యూచువల్ ఫండ్

అసంస్థాగత రంగం నుంచి అనేక వ్యాపారాలు వ్యవస్థీకృతం అవుతుండడం.. ఈ కంపెనీకి అత్యంత అనుకూలమైన విషయంగా చెప్పవచ్చు. అలాగే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను అమలు చేయడం కూడా కలిసొచ్చింది. అసంస్థాగత మార్కెట్‌లో 25 శాతం వరకూ రాబోయే మూడేళ్లలో వ్యవస్థీకృతం కానున్నాయన్న అంచనాలు.. ప్లైవుడ్ రంగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న ఈ కంపెనీకి సానుకూలం.

 

టాటా ఎలెక్సీ

 • ప్రస్తుత ధర: రూ. 1,045 
 • మార్కెట్ క్యాప్: రూ. 6,507 కోట్లు
 • బయ్యర్: ఐసీఐసీఐ మ్యూచువల్ ఫండ్

పలు వ్యాపార విభాగాలలో ఉండడం టాటా ఎలెక్సీ అభివృద్ధిలో అత్యంత కీలకమైన అంశం. ఆటోమోటివ్, బ్రాడ్‌కాస్ట్ అండ్ కమ్యూనికేషన్, టెలికాం, మెడికల్ ఎక్విప్‌మెంట్ పరిశ్రమలకు డిజైన్, టెక్నాలజీ సర్వీసులను ఈ కంపెనీ అందిస్తోంది. ఐఓటీ, రోబోటిక్స్, డేటా ఎనలైటిక్స్ రంగాలకు కూడా టాటా ఎలెక్సీ సేవలు అందిస్తోంది. 

 

మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్

 • ప్రస్తుత ధర: రూ. 245 
 • మార్కెట్ క్యాప్: రూ. 9,305 కోట్లు
 • బయ్యర్: ఐడీఎఫ్‌సీ మ్యూచువల్ ఫండ్

ఆటోమోటివ్ కాంపొనెంట్స్ సప్లై చేసే మహీంద్రా సీఐఈ ఆటోమోటివ్ ప్రస్తుతం భారీ స్థాయిలో వృద్ధి సాధిస్తోంది. మన దేశంలో ఆటోమొబైల్ సెగ్మెంట్ వేగంగా వృద్ధి సాధిస్తుండడం, ఓవర్సీస్ ద్వారాను అలాగే అనుబంధ కంపెనీల ద్వారాను కస్టమర్ల సంఖ్యను పెంచుకుంటూ ఉండడం వంటి పలు కారణాలు.. ఈ కంపెనీ అభివృద్ధికి దోహదం చేయనున్నాయి. క్యాపెక్స్ కూడా గణనీయంగా పెరుగుతోంది. సమీప భవిష్యత్తులో పెట్టుబడులు చేయాల్సిన అవసరం లేకపోవడం ఈ కంపెనీ ప్రగతికి దోహదం చేయనుంది.
 Most Popular