నేటి నుంచీ న్యూజెన్‌ ఐపీవో!

నేటి నుంచీ న్యూజెన్‌ ఐపీవో!

ఢిల్లీ కేంద్రంగా ఐటీ సేవలందించే న్యూజెన్ సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీస్‌ పబ్లిక్‌ ఇష్యూ నేటి(16) నుంచి మొదలుకానుంది. 18న ముగియనున్న ఐపీవోకు ధరల శ్రేణి రూ. 240-245కాగా.. తద్వారా రూ. 424 కోట్లను సమీకరించాలని భావిస్తోంది. ఇష్యూలో భాగంగా 1.34 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచడంతోపాటు రూ. 95 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను న్యూజెన్‌ తాజాగా జారీ చేయనుంది. 

ఇతర వివరాలు
న్యూజెన్‌ ఐపీవోకు లాట్‌ పరిమాణం 61 షేర్లుకావడంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 61 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇంతకంటే అధికంగా కావాలనుకుంటే.. రూ. 2 లక్షల విలువకు మించకుండా ఇవే గుణిజాల్లో ఒకేసారి అప్లై చేయాల్సి ఉంటుంది. షేర్లు బీఎస్ఈ, ఎన్‌ఎస్ఈలలో లిస్ట్‌కానున్నాయి. ఐపీవో నిధులను సాధారణ పాలనా వ్యవహారాలకు వినియోగించనున్నట్లు కంపెనీ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. 

యాంకర్‌ నిధులు!
సోమవారం(15న) న్యూజెన్‌ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 127 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 245 ధరలో 9 యాంకర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలకు దాదాపు 52 లక్షల షేర్లను కేటాయించింది.Most Popular