రిటైర్‌మెంట్ తర్వాత ఆదాయం పొందేందుకు ఐదు మార్గాలు

రిటైర్‌మెంట్ తర్వాత ఆదాయం పొందేందుకు ఐదు మార్గాలు

ప్రతీ వ్యక్తికి రెగ్యులర్‌గా ఆదాయం అవసరమే. ఉద్యోగం చేస్తున్నపుడు నెలవారీగా వచ్చే జీతం అవసరాలను తీరుస్తుంది. స్వయం ఉపాధి పొందేవారికి ప్రతీ నెలా ఆదాయం లభించకపోయినా.. వ్యాపారాల ద్వారా వచ్చిన లాభాల నుంచి సొంత ఖర్చులను తీర్చుకుంటారు. అయితే, వీరిలో ఎవరైనా సరే రిటైర్ అవాలనుకుంటే పరిస్థితి ఏంటి? అతను/ఆమెకు రెగ్యులర్ ఇన్‌కం అప్పుడు ఎలా లభిస్తుంది? 

ఇలా క్రమాంతరాల్లో ఆదాయం పొందేందుకు ఐదు ఉత్తమ మార్గాలు ఇక్కడ ఉన్నాయి. 

 

వేతనం & పెన్షన్: పెన్షన్ ఆదాయంపై కూడా సాధారణ వేతనం మాదిరిగానే పన్నులు ఉంటాయి. వీటిపై అప్పటి పన్ను శ్లాబుల ప్రకారం పన్నులు చెల్లించాల్సిందే. ఒకవేళ మీకు పెన్షన్ మాత్రమే ఆదాయ మార్గం అయి ఉండి, మీ వార్షిక పెన్షన్ మొత్తం రూ. 2.5 లక్షల లోపు ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ పరిమితికి మించితే తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సిందే. 

 

బాండ్లు & ఫిక్సెడ్ డిపాజిట్లపై వడ్డీలు: క్రమాంతరంగా ఆదాయం పొందేందుకు బాండ్లు మరియు డిపాజిట్లపై వడ్డీలు పొందేలా ప్రణాళిక చేయడం ఒక చేయడం మార్గం. మీ ఆదాయ అవసరాలకు అనుగుణంగా వడ్డీ రేట్లను అందిచే బాండ్లను ఎంచుకోవచ్చు. అనేక ఫిక్సెడ్ డిపాజిట్లు నెలవారీ, త్రైమాసికం, వార్షిక వడ్డీలను అందిస్తాయి. వారి అవసరాలకు తగినట్లుగా ఐచ్ఛికాలను ఎంచుకోవచ్చు.
వయో వృద్ధులు సీనియర్ సిటిజెన్స్ సేవింగ్స్ స్కీమ్ ఎంచుకోవడం ద్వారా రెండు రకాల ప్రయోజనం పొందవచ్చు. 8.4 శాతం చొప్పున అధిక వడ్డీ పొందడంతో పాటు ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం పన్ను మినహాయింపులు పొందవచ్చు.

 

షేర్లు & ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌పై డివిడెండ్స్ : తాము ఆర్జించిన లాభాలను అనుసరించిన కంపెనీలు డివిడెండ్లను ప్రకటిస్తాయి. సహజంగా ఇవి వార్షికంగా ఉన్నా.. మధ్యంతర డివిడెండ్‌ కూడా లభిస్తూ ఉంటుంది. ఆ కంపెనీ లాభం ప్రకారం డివిడెండ్‌ను నిర్ణయిస్తారు. అందుకే ఈ డివిడెండ్ అనేది గ్యారంటీ మొత్తం కాదు. మన దేశంలో కంపెనీలు ప్రకటించే డివిడెండ్లు పన్ను రహితం. అయితే ఏడాదికి రూ. 10 లక్షలకు మించి డివిడెండ్ పొందితే మాత్రం 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీలు డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ రూపంలో 17 శాతం చెల్లించాలి.

గడించిన లాభాలపై ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా డివిడెండ్ ప్రకటిస్తాయి. అయితే వీటిపై డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ లేదా డివిడెండ్ పై ట్యాక్స్ ఉండవు. కొంతమేరకు రిస్క్ భరించగలిగే మదుపర్లు తమ ఈక్విటీ పెట్టుబడులలో 35శాతం మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో కేటాయించాలని ఫైనాన్షియల్ ఎక్స్‌పర్ట్స్ చెబుతారు.

కొన్ని బ్యాలెన్స్‌డ్ ఫండ్స్ కూడా నెలవారీగా డివిడెండ్ చెల్లింపు ఆప్షన్ కలిగి ఉంటాయి. రెగ్యులర్ ఇన్‌కం కావాలని అనుకునేవారికి ఇవి ఉత్తమం.

 

డెట్ మ్యూచువల్ ఫండ్స్‌పై డివిడెండ్స్: డెట్ మ్యూచువల్ ఫండ్స్ లేదా నాన్-ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కూడా డివిడెండ్ ప్రకటిస్తాయి. ఇవి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌తో పోల్చితే తక్కువ ఓలటాలిటీ కలిగి ఉంటాయి. 

 

సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్: మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌ను కూడా ఎంచుకోవచ్చు. మీ మ్యూచువల్ ఫండ్స్ బ్యాలెన్స్ లోంచి కొన్ని నిర్ణీత యూనిట్లను.. క్రమాంతరాలలో విక్రయించడం ద్వారా నగదు ఉపసంహరించుకోవడమే వీటి విధానం. మ్యూచువల్ ఫండ్స్ విక్రయం ద్వారా పొందే ఆదాయంపై క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ ఉంటుంది. దానితో పోల్చితే ఇది ఉత్తమమైన విధానం. Most Popular