ఇన్ఫోసిస్‌ లాభం రూ. 5129 కోట్లు

ఇన్ఫోసిస్‌ లాభం రూ. 5129 కోట్లు

సాఫ్ట్‌వేర్‌ సేవల దేశీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెల్లడించడంతో ఈ ప్రభావం సోమవారం ట్రేడింగ్‌లో షేరుపై కనిపించే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఎన్‌ఎస్ఈలో ట్రేడింగ్‌ ముగిసేసరికి ఇన్ఫోసిస్‌ షేరు 0.25 శాతం బలపడి రూ. 1079 వద్ద ముగిసింది.
పన్ను దన్ను
ఇన్ఫోసిస్‌ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో అంచనాలను మించుతూ రూ. 5,129 కోట్ల నికర లాభం ప్రకటించింది. త్రైమాసిక ప్రాతిపదికన పన్ను వ్యయాలు రూ. 1471 కోట్ల నుంచి రూ. 144 కోట్లకు తగ్గడంతో నికర లాభం మెరుగుపడినట్లు నిపుణులు తెలియజేశారు. మొత్తం ఆదాయం రూ. 17,794 కోట్లుగా నమోదైంది. 
గైడెన్స్‌ ఓకే
ప్రస్తుత ఏడాది(2014-18)కి డాలర్ల రూపేణా ఆదాయంలో 6.5-7.5 శాతం వృద్ధి సాధించగలమని గైడెన్స్‌ ప్రకటించింది. క్యూ2తో పోలిస్తే కన్సాలిడేట్‌ పద్ధతిలో ఉద్యోగ వలసరేటు 21.4 శాతం నుంచి  18.7 శాతానికి తగ్గినట్లు కంపెనీ పేర్కొంది. ఈ త్రైమాసికంలో సిబ్బంది సంఖ్యకు కొత్తగా 3251 మంది జత కలిసినట్లు తెలియజేసింది.Most Popular