2-3 ఏళ్లకు ఈ స్టాక్స్ మల్టీబ్యాగర్స్‌గా మారతాయ్!

2-3 ఏళ్లకు ఈ స్టాక్స్ మల్టీబ్యాగర్స్‌గా మారతాయ్!

ఈక్విటీ మార్కెట్లలో స్ట్రాంగ్ మూమెంటం రాబోయే ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీఎస్‌టీ, డీమానిటైజేషన్ వంటి పరిస్థితులను తట్టుకుని మరీ ఇండెక్స్‌లు నిలబడ్డాయి. ఫిస్కల్ డెఫిసిట్‌పై ప్రభావం పడుతున్న మౌలిక రంగానికే కేంద్రం మద్దతు ఇస్తుండడం, కలిసొస్తున్న అంతర్జాతీయ పరిస్థితులు, కమాడిటీ ధరలు అనుకూలంగా ఉండడం వంటివి మన మార్కెట్లకు సానుకూలంగా చెప్పవచ్చు. 

ప్రభుత్వ ఖర్చులు పెరగడంతో.. పర్చేజింగ్ పవర్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో ఈ ఏడాది కంపెనీల ఆదాయాలు 17-18 శాతం ఊపందుకోవచ్చు. 2018 చివరినాటికి నిఫ్టీ 12,500 పాయింట్ల స్థాయిని అందుకుంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కింది స్టాక్స్ 2-3 ఏళ్ల కాలంలో మల్టీబ్యాగర్స్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

మొయిల్: ప్రస్తుత ధర- రూ. 255
డిమాండ్ పెరగడంతో దేశీయంగా స్టీల్ ఉత్పత్తి గణనీయంగా ఊపందుకుంది. జనవరి1 నుంచి రేట్లను సవరించడం కూడా కంపెనీకి కలిసొచ్చే విషయం. 

 

గణేషా ఎకోస్ఫియర్: రూ. - రూ 435
దేశవ్యాప్తంగా పెట్‌ డిమాండ్ పెరగడంతో.. లబ్ధి పొందనున్న కంపెనీ గణేషా ఎకోస్ఫియర్. పర్యావరణ పరిరక్షణకు చేపడుతున్న చర్యల కారణంగా.. ఆ కంపెనీ ప్రయోజనం పొందనుంది. 

 

రాజూ ఇంజినీర్స్: ప్రస్తుత ధర రూ. 50
ఉత్పత్తుల ప్యాకేజింగ్‌కు సంబంధించిన మెషినరీని రాజూ ఇంజినీర్స్ అందిస్తుంది. వినియోగం పెరగడం, ఎఫ్‌ఎంసీజీ డిమాండ్ కారణంగా ఈ కంపెనీ లబ్ధి పొందనుంది. 

 

గ్రీవ్స్ కాటన్: ప్రస్తుత ధర రూ. 147
బీఎస్ 4 డీజిల్, అల్టర్నేటివ్ ఫ్యూయల్ ఇంజిన్ల తయారీపై పియాగోతో గ్రీవ్స్‌ కాటన్ ఒప్పందం చేసుకుంది. కమర్షియల్ వాహనాల విక్రయాలు  పెరగడం, పర్యావరణ పరిరక్షణ దిశగా చేపడుతున్న చర్యలు ఈ కంపెనీకి సానుకూలం.

 

ఫ్లెక్స్ ఫుడ్స్: రూ. 136
యూఫ్లెక్స్‌కు చెందిన అసోసియేట్ కంపెనీ ఫ్లెక్స్‌ ఫుడ్స్. ఫ్లెక్సిబుల్ ప్యాకేజింగ్ టెక్నాలజీలో ఈ కంపెనీ మార్కెట్ లీడర్. వాక్యూమ్ ఫ్రీజ్ చేయబడిన డ్రైడ్, ఎయిర్ డ్రైడ్, ఫ్రోజెన్, క్విక్ ఫ్రోజెన్ ప్రొడక్టులను ఈ కంపెనీ అందిస్తుంది.

 

హిందుస్తాన్ ఆయిల్ ఎక్స్‌ప్లొరేషన్: ప్రస్తుత ధర రూ. 139
ప్రొఫెషనల్ బోర్డ్, డెట్ ఫ్రీ బ్యాలెన్స్ షీట్ కలిగిన తొలి ప్రైవేటు రంగ ఓ&జీ కంపెనీ ఇది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం.. దేశీయంగా గ్యాస్‌కు డిమాండ్ ఊపందుకోవడం వంటి కారణాలతో.. క్రమంగా ఈ కంపెనీ ప్రయోజనం పొందనుంది.Most Popular