కర్ణాటక బ్యాంక్‌ ఫలితాలు భేష్‌

కర్ణాటక బ్యాంక్‌ ఫలితాలు భేష్‌

ప్రయివేట్‌ రంగ సంస్థ కర్ణాటక బ్యాంక్‌ ఈ ఏడాది మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు ప్రకటించింది. దీంతో ఈ కౌంటర్ బలపడింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 3 శాతం పెరిగి రూ. 168 వద్ద ట్రేడవుతోంది.
రూ. 88 కోట్లు
కర్ణాటక బ్యాంక్‌ నికర లాభం క్యూ3(అక్టోబర్-డిసెంబర్‌)లో రూ. 69 కోట్ల నుంచి రూ. 88 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం(ఎన్‌ఐఐ) రూ. 376 కోట్ల నుంచి రూ. 452 కోట్లకు జంప్‌చేసింది. త్రైమాసిక ప్రాతిపదికన స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 3.04 శాతం నుంచి 2.85 శాతానికి క్షీణించాయి. నికర ఎన్‌పీఏలు సైతం 4.13 శాతం నుంచి 3.97 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్లు సైతం రూ. 226 కోట్ల నుంచి రూ. 196 కోట్లకు తగ్గాయి. Most Popular