పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌ అప్పర్‌ సర్క్యూట్‌!

పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌ అప్పర్‌ సర్క్యూట్‌!

కొత్త తరహా ఇయర్‌ ఫోన్స్‌ను మార్కెట్లోకి విడుదల చేయడంతో పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌కు భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 113 వద్ద ట్రేడవుతోంది. 
అనుబంధ సంస్థ పాల్‌రెడ్‌ ఆన్‌లైన్‌ టెక్నాలజీస్‌ ద్వారా పీట్రాన్‌ బూమ్‌ 4డీ స్పోర్ట్స్‌ ఇయర్‌ఫోన్స్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు పాల్‌రెడ్‌ టెక్నాలజీస్‌ తాజాగా పేర్కొంది. లేటెస్ట్‌ ఫ్యాషన్‌తోకూడిన సౌకర్యవంతమైన స్టీరియో ఇయర్‌ఫోన్స్‌ను అధిక సమయం వినియోగించినప్పటికీ కస్టమర్లకు ఇబ్బంది ఉండదని వివరించింది.Most Popular