ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌కు రేటింగ్‌ పుష్‌

ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌కు రేటింగ్‌ పుష్‌

దేశీ బ్రోకింగ్‌ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ బయ్‌ రేటింగ్‌ను ప్రకటించడంతో ఎంఏఎస్ ఫైనాన్షియల్‌ కౌంటర్‌కు డిమాండ్‌ ఊపందుకుంది. ప్రస్తుతం బీఎస్ఈలో ఈ షేరు దాదాపు 4 శాతం జంప్‌చేసి రూ. 650 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 657 వరకూ ఎగసింది.  
రూ. 907 టార్గెట్‌
రానున్న మూడేళ్ల కాలంలో ఎంఏఎస్‌ ఫైనాన్షియల్‌ నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) వార్షిక సగటున 30 శాతం చొప్పున పుంజుకోగలవని మోతీలాల్‌ అభిప్రాయపడింది. ఇదే విధంగా నికర లాభాలు మరింత అధికంగా 44 శాతం చొప్పున జంప్‌చేయగలవని అంచనా వేసింది. దీంతో రూ. 907 టార్గెట్‌ ధరతో ఎంఏఎస్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫారసు చేసింది. Most Popular