స్వల్ప లాభాలతో- రియల్టీ నేలచూపు!

స్వల్ప లాభాలతో- రియల్టీ నేలచూపు!

సుప్రీం కోర్టు నిర్వహణపై నలుగురు సీనియర్‌ జస్టిస్‌లు బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఉన్నట్టుండి దెబ్బతిన్న దేశీ స్టాక్‌ మార్కెట్లు కోలుకున్నాయి. 100 పాయింట్ల లాభాల స్థాయి నుంచి 100 పాయింట్ల నష్టాలకు పతనమైన సెన్సెక్స్‌ ప్రస్తుతం 45 పాయింట్లు బలపడింది. 34,548 వద్ద కదులుతోంది. నిఫ్టీ సైతం 12 పాయింట్లు పుంజుకుని 10,663కు చేరింది.
ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా వీక్‌
ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ అత్యధికంగా 1.3 శాతం క్షీణించగా.. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాలు 0.5 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. రియల్టీ షేర్లలో ఒబెరాయ్‌, యూనిటెక్, శోభా, ఫీనిక్స్‌, ప్రెస్టేజ్‌, హెచ్‌డీఐఎల్‌, డీఎల్‌ఎఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ 3-1 శాతం మధ్య తిరోగమించాయి.  
బ్లూచిప్స్‌ ఇలా
నిఫ్టీ దిగ్గజాలలో ఐసీఐసీఐ, జీ, హెచ్‌పీసీఎల్‌, ఓఎన్‌జీసీ, వేదాంతా, ఆర్‌ఐఎల్‌, మారుతీ, హెచ్‌సీఎల్‌ టెక్‌ 2-1 శాతం మధ్య లాభపడగా.. భారతీ, బాష్‌, అదానీ పోర్ట్స్‌, లుపిన్‌, ఐబీ హౌసింగ్‌, యూపీఎల్‌, సన్‌ ఫార్మా, యస్‌బ్యాంక్‌, ఐటీసీ, హెచ్‌యూఎల్‌ 1 శాతం స్థాయిలో నీరసించాయి.Most Popular