యూరోపియన్‌ మార్కెట్లు సానుకూలం!

యూరోపియన్‌ మార్కెట్లు సానుకూలం!

యూఎస్‌, ఆసియా స్టాక్ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాల కారణంగా యూరోపియన్‌ స్టాక్‌ మార్కెట్లు ఆశావహంగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం యూకే ఇండెక్స్‌ ఎఫ్‌టీఎస్‌ఈ నామమాత్రంగా 0.12 శాతం లాభంతో కదులుతుంటే... ఫ్రాన్స్‌ ఇండెక్స్‌ సీఏసీ 0.2 శాతం, జర్మన్‌ ఇండెక్స్‌ డాక్స్‌ 0.3 శాతం చొప్పున ఎగశాయి. 
యూరో 1.20కు
జేపీ మోర్గాన్‌, వెల్స్‌ ఫార్గో, బ్లాక్‌రాక్‌ వంటి దిగ్గజాలు నేడు ప్రకటించనున్న ఫలితాలపై అంచనాలతో యూఎస్‌ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను అందుకోవడంతో సెంటిమెంటు బలపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. కాగా... డాలరుతో మారంకలో యూరో మూడు నెలల గరిష్టం 1.204కు చేరగా.. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌(ఈసీబీ) సహాయక ప్యాకేజీలను ఎత్తివేయనున్న సంకేతాలు యూరోజోన్‌ బలపడుతున్న అంచనాలకు కారణమవుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.Most Popular