జీపీటీ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌కు ఆర్డర్‌ దన్ను!

జీపీటీ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌కు ఆర్డర్‌ దన్ను!

ఇర్కాన్‌ ఇంటర్నేషనల్‌ నుంచి ఆర్డర్‌ పొందినట్లు వెల్లడించడంతో జీపీటీ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 3.6 శాతం జంప్‌చేసి రూ. 221 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 224 వరకూ ఎగసింది. 
రూ. 37 కోట్లు
కియుల్‌-గయ రైల్వేలైన్‌లో ప్రధాన బ్రిడ్జివద్ద అనుబంధ నిర్మాణాల కోసం రూ. 37 కోట్ల విలువైన కాంట్రాక్టులు లభించినట్లు జీపీటీ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్‌ పేర్కొంది. రెండు లైన్ల ఈ బ్రిడ్జి వద్ద అనుబంధ నిర్మాణాలను ఏడాదిన్నరలోగా పూర్తి చేయాల్సి ఉంటుందని తెలియజేసింది.Most Popular