మార్కెట్లకు జ్యుడీషియరీ షాక్!

మార్కెట్లకు జ్యుడీషియరీ షాక్!

సుప్రీం కోర్టులో సీనియర్‌ జస్టిస్‌లు నలుగురు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జస్టిస్‌ లోయా కేసు అప్పగింతసహా కోర్టు నిర్వహణపట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడంతో మార్కెట్లలో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 128 పాయింట్లు క్షీణించి 34,378కు చేరగా.. నిఫ్టీ 45 పాయింట్ల వెనకడుగుతో 10,606ను తాకింది.
రియల్టీ పతనం
ఎన్‌ఎస్‌ఈలో మీడియా మినహా అన్ని రంగాలూ నష్టపోగా రియల్టీ అత్యధికంగా 1.6 శాతం పతనమైంది. ఈ బాటలో ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ 1-0.7 శాతం మధ్య బలహీనపడ్డాయి.
ఎఫ్‌అండ్‌వోలో
డెరివేటివ్‌ కౌంటర్లలో డిష్‌ టీవీ, అదానీ పవర్‌, రిలయన్స్ నావల్‌, ఆర్‌కామ్‌, మణప్పురం, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, జీఎంఆర్‌, ఐడియా, ఆర్‌పవర్‌, శ్రీసిమెంట్‌ 6.5-3 శాతం మధ్య తిరోగమించాయి. అయితే మరోపక్క టీవీ18, జైన్‌ ఇరిగేషన్‌, వోల్టాస్‌, జీ, టాటా గ్లోబల్‌, ఎస్‌ఆర్‌ఎఫ్‌, సన్‌ టీవీ, చెన్నై పెట్రో, కాల్గేట్‌ పామోలివ్‌, హెచ్‌సీసీ 3-1 శాతం మధ్య బలపడ్డాయి.Most Popular