ఆటో, మెటల్స్‌ అప్‌- ఐటీ, ఫార్మా వీక్‌!

ఆటో, మెటల్స్‌ అప్‌- ఐటీ, ఫార్మా వీక్‌!

సరికొత్త రికార్డులతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 83 పాయింట్లు పెరిగి 34,586కు చేరగా.. నిఫ్టీ 24 పాయింట్లు బలపడి 10,675ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలో మీడియా అత్యధికంగా 2 శాతం జంప్‌చేయగా.. మెటల్‌ 0.9 శాతం, ఆటో 0.5 శాతం చొప్పున బలపడ్డాయి. అయితే ఐటీ 0.5 శాతం, ఫార్మా 0.3 శాతం చొప్పున బలహీనపడ్డాయి.
దిగ్గజాల తీరిదీ
నిఫ్టీ దిగ్గజాలలో జీ, వేదాంతా, మారుతీ, ఐసీఐసీఐ, ఆర్‌ఐఎల్‌, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ, గెయిల్‌, హిందాల్కో 2.2-0.7 శాతం మధ్య పురోగమించాయి. అయితే టీసీఎస్‌ 1.4 శాతం క్షీణించింది. ఈ బాటలో భారతీ, యూపీఎల్‌, సన్‌ ఫార్మా, లుపిన్‌, సిప్లా, బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌ 1-0.4 శాతం మధ్య నీరసించాయి.Most Popular