ఆర్డర్లతో రెండో రోజూ బోధ్‌ట్రీ ర్యాలీ

ఆర్డర్లతో రెండో రోజూ బోధ్‌ట్రీ ర్యాలీ

క్లౌడ్‌, అనలిటిక్స్‌, డిజిటల్ సొల్యూషన్స్ అందించే బోధ్‌ట్రీ కన్సల్టింగ్‌కు వరుసగా రెండో రోజు ఆర్డర్‌ లభించడంతో మరోసారి జోరందుకుంది. ప్రస్తుతం బీఎస్‌ఈలో దాదాపు 5 శాతం జంప్‌చేసి రూ. 100 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 103 వరకూ ఎగసింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. గురువారం సైతం ఈ షేరు 5 శాతం పురోగమించి రూ. 95.5 వద్ద ముగిసింది. 
రూ. 43 కోట్లు
బీహార్‌లోని మగధ్ యూనివర్శిటీ నుంచి డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ సేవలకు ఆర్డర్‌ లభించినట్లు తాజాగా బోధ్‌ట్రీ కన్సల్టింగ్‌ పేర్కొంది. మూడేళ్లపాటు అమలులో ఉండే ఆర్డర్‌ విలువ రూ. 43 కోట్లుకాగా... యూనివర్శిటీలో పలు విభాగాలను డిజిటైజ్‌ చేయాల్సి ఉంటుందని తెలియజేసింది. కాగా.. గురువారం సైతం ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రీసెర్చ్‌ ఎడ్యుకేషన్‌(ఐసీఎఫ్‌ఆర్‌ఈ) డెహ్రాడూన్‌ నుంచి బోధ్‌ట్రీకి డేటా సెంటర్‌ను అప్‌గ్రేడ్‌ చేసేందుకు రూ. 8.4 కోట్ల విలువైన కాంట్రాక్టు లభించిన విషయం విదితమే. Most Popular