జపాన్‌ మినహా ఆసియా మార్కెట్లు ఓకే!

జపాన్‌ మినహా ఆసియా మార్కెట్లు ఓకే!

చమురు ధరలు మూడేళ్ల గరిష్టాలకు చేరడం, యూరోపియన్‌ కేంద్ర బ్యాంకు(ఈసీబీ) సహాయక ప్యాకేజీల నిలుపుదల సంకేతాలు వంటి సానుకూల అంశాల కారణంగా ఆసియా స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. ఆసియా మార్కెట్లలో జపాన్‌ మినహా మిగిలిన అన్ని మార్కెట్లూ సానుకూలంగా కదులుతున్నాయి. డాలరుతో మారకంలో యూరో  1.20కు బలపడగా.. ఆరు ప్రధాన కరెన్సీలతో  మారకంలో డాలరు బలహీనపడింది. జపనీస్‌ యెన్‌ 111.21 వద్ద ట్రేడవుతోంది. 
లాభాల్లో 
ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో తైవాన్‌, థాయ్‌లాండ్‌, హాంకాంగ్‌ 0.6-0.4 శాతం మధ్య ఎగశాయి. ఈ బాటలో సింగపూర్‌ 0.2 శాతం బలపడగా..  కొరియా, చైనా స్వల్ప లాభాలతో కదులుతున్నాయి. ఇండొనేసియా యథాతథంగా ట్రేడవుతుంటే...  జపాన్‌ 0.5 శాతం తిరోగమించింది.Most Popular