మార్కెట్ల రికార్డ్స్‌- చిన్న షేర్లు అప్‌!

మార్కెట్ల రికార్డ్స్‌- చిన్న షేర్లు అప్‌!

ప్రపంచ సానుకూలతలకుతోడు దేశీ ఫండ్స్‌ భారీ కొనుగోళ్ల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి కొత్త రికార్డులకు తెరతీశాయి. సెన్సెక్స్‌ 34,638 వద్ద కొత్త గరిష్టాన్ని తాకగా.. నిఫ్టీ 10,690 వరకూ ఎగసింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 104 పాయింట్లు పెరిగి 34,608కు చేరగా.. నిఫ్టీ 32 పాయింట్లు పురోగమించి 10,684 వద్ద ట్రేడవుతోంది. మార్కెట్ల బాటలో చిన్న షేర్లూ జోరందుకోవడం విశేషం!
స్మాల్‌ క్యాప్స్‌ జోరు
బీఎస్ఈలో మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్ 0.3 శాతం బలపడగా.. స్మాల్‌ క్యాప్‌ మరింత అధికంగా 0.75 శాతం ఎగసింది. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1,638 లాభపడితే.. 769 నష్టాలతో ట్రేడవుతున్నాయి.  
స్మాల్‌ క్యాప్స్‌లో కేఈఐ, శేషసాయి, పటేల్‌ ఇంజినీరింగ్‌, ఉత్తమ్‌ స్టీల్‌, డ్యుకాన్‌, స్నోమ్యాన్‌, సర్దా ఎనర్జీ, సీక్వెంట్‌, ఇండొరమా, వెల్‌స్పన్‌ కార్ప్‌, టిన్‌ప్లేట్‌, ఫస్ట్‌సోర్స్‌ తదితరాలు 10-7 శాతం మధ్య జంప్‌చేశాయి. Most Popular