సింటెక్స్‌ ప్లాస్టిక్స్‌కు క్యూ3 దెబ్బ!

సింటెక్స్‌ ప్లాస్టిక్స్‌కు క్యూ3 దెబ్బ!

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో సింటెక్స్‌ ప్లాస్టిక్స్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం బీఎస్‌ఈలో ఈ షేరు 5.4 శాతం పతనమై రూ. 88 దిగువన ట్రేడవుతోంది. 
ఇబిటా 3 శాతం డౌన్‌ 
సింటెక్స్‌ ప్లాస్టిక్స్‌ క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో రూ. 52 కోట్ల నికర లాభం ప్రకటించింది. ఇతర ఆదాయం ఇందుకు సహకరించగా..  నిర్వహణ లాభం 3 శాతం క్షీణించి రూ. 185 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం 7 శాతం తక్కువగా రూ. 1333 కోట్లను తాకింది.Most Popular