ఆ డీల్‌తో ఇండియాబుల్స్‌ రియల్టీ అప్‌!

ఆ డీల్‌తో ఇండియాబుల్స్‌ రియల్టీ అప్‌!

సొంత అనుబంధ సంస్థ ద్వారా గురుగ్రామ్‌లోని వాణిజ్య భవన కొనుగోలుకి ఒప్పందాన్ని కుదుర్చుకున్న వార్తలతో ఇండియాబుల్స్‌ రియల్టీ కౌంటర్‌ పుంజుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్ఈలో ఈ షేరు 2.5 శాతం పెరిగి రూ. 262 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 263 వరకూ ఎగసింది.

యషితా బిల్డ్‌కాన్‌ ద్వారా 2.5 లక్షల చదరపు అడుగుల్లో కొత్తగా నిర్మించిన వాణిజ్య భవన కొనుగోలుకి తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ఐబీ రియల్టీ పేర్కొంది. దీంతో గురుగ్రామ్‌లో 2.5 లక్షల చదరపు అడుగుల లీజబుల్‌ ఏరియా అందుబాటులోకి రానున్నట్లు తెలియజేసింది.Most Popular