అమెరికా బాటలో దేశీ మార్కెట్లూ!

అమెరికా బాటలో దేశీ మార్కెట్లూ!

సరికొత్త రికార్డుల ర్యాలీలో సాగుతున్న అమెరికా మార్కెట్ల బాటలోనే దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం పరుగు తీస్తున్నాయి. గురువారం డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ చరిత్రాత్మక గరిష్టాలను అందుకోగా.. తాజాగా సెన్సెక్స్‌, నిఫ్టీ, మిడ్‌ క్యాప్‌ ఇండెక్సులు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే కొత్త రికార్డులను నెలకొల్పాయి. సెన్సెక్స్‌ సెంచరీతో ప్రారంభమైంది. 108 పాయింట్లు పెరిగి 34,612కు చేరింది. నిఫ్టీ సైతం 31 పాయింట్లు ఎగసి 10,682 వద్ద ట్రేడవుతోంది.
అన్ని రంగాలూ ఓకే
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడగా.. మెటల్‌, పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఫార్మా, ఆటో 0.7-0.3 శాతం మధ్య బలపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో వేదాంతా, ఐవోసీ, ఐబీ హౌసింగ్‌, హిందాల్కో, ఐసీఐసీఐ, యాక్సిస్‌, ఆర్‌ఐఎల్‌, టాటా మోటార్స్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ 1.5-0.6 శాతం మధ్య పురోగమించాయి. అయితే టీసీఎస్, భారతీ, ఐషర్‌ మాత్రమే చెప్పుకోదగ్గ స్థాయిలో 1.2-0.3 శాతం మధ్య నీరసించాయి.Most Popular