మళ్లీ అమెరికా మార్కెట్ల హైజంప్‌!

మళ్లీ అమెరికా మార్కెట్ల హైజంప్‌!

ఒక రోజు విరామం తరువాత అమెరికా స్టాక్ మార్కెట్లు తిరిగి లాభాల హైజంప్‌ చేశాయి. ప్రధానంగా ఇంధన రంగం 2 శాతం పుంజుకోవడం మార్కెట్లకు బలాన్నివ్వగా.. మీడియా, రిటైల్‌ కౌంటర్లు ఊపందుకోవడం కూడా దీనికి జత కలిసింది. వెరసి గురువారం ట్రేడింగ్‌ ముగిసేసరికి డోజోన్స్‌ 206 పాయింట్లు(0.8 శాతం) ఎగసి 25,575 వద్ద నిలవగా.. ఎస్‌అండ్‌పీ 19 పాయింట్లు(0.7 శాతం) పెరిగి 2,767 వద్ద స్థిరపడింది. నాస్‌డాక్‌ సైతం 58 పాయింట్లు(0.8 శాతం) పురోగమించి 7,212 వద్ద ముగిసింది. ఇవి చరిత్రాత్మక గరిష్టాలు కావడం విశేషం!!
డెల్టా ఎయిర్‌లైన్స్‌ అప్‌
యూఎస్‌ బాండ్లలో పెట్టుబడులను తగ్గించనున్న అంచనాలు నిరాధారమైనవని చైనా ఫారెక్స్‌ అధికారికవర్గాలు స్పష్టం చేయడం, ముడిచమురు ధరలు మరోసారి దూసుకెళ్లడం.. క్యూ4(అక్టోబర్‌-డిసెంబర్‌) ఫలితాలపై ఆశావహ అంచనాలు ఇన్వెస్టర్లకు జోష్‌నిచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. పన్ను సంస్కరణల కారణంగా లబ్ది పొందనున్న అంచనాలతో డెల్టా ఎయిర్‌లైన్స్‌ 5 శాతం జంప్‌చేయగా.. జేపీ మోర్గాన్‌, వెల్స్‌ ఫార్గో నేడు ఫలితాలు ప్రకటించనున్నాయి.Most Popular