లాభాల ఓపెనింగ్‌ నేడు?!

లాభాల ఓపెనింగ్‌ నేడు?!

దేశీ స్టాక్ మార్కెట్లు నేడు లాభాల(గ్యాపప్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ప్రస్తుతం సింగపూర్(ఎస్‌జీఎక్స్) నిఫ్టీ 42 పాయింట్లు జంప్‌చేసి 10,700 వద్ద ట్రేడవుతోంది. సాధారణంగా దేశీ మార్కెట్ల ట్రెండ్‌ను ఎస్‌జీఎక్స్ నిఫ్టీ ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఇటీవల ర్యాలీ బాటలో సాగిన దేశీ స్టాక్‌ మార్కెట్లు  బుధవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నప్పటికీ తిరిగి గురువారం సరికొత్త గరిష్టాలను అందుకున్నాయి. అయితే రోజంతా స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య కన్సాలిడేట్‌ అయ్యాయి. గురువారం ట్రేడింగ్ ముగిసేసరికి సెన్సెక్స్‌ 70 పాయింట్లు పెరిగి 34,503 వద్ద నిలవగా.. నిఫ్టీ 19 పాయింట్లు బలపడి 10,651 వద్ద స్థిరపడింది.  

నేడు నిఫ్టీ కదలికలు ఇలా...
నేడు నిఫ్టీ ఊపందుకుంటే..  తొలుత 10,673 పాయింట్ల వద్ద, తదుపరి 10,695 స్థాయిలోనూ రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని సాంకేతిక విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ నిఫ్టీ బలహీనపడితే తొలుత 10,621 పాయింట్ల వద్ద, తదుపరి 10,590 స్థాయిలోనూ మద్దతు లభించే వీలున్నదనిఅంచనా వేశారు.  

ఎఫ్‌పీఐల అమ్మకాలు..
నగదు విభాగంలో గురువారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దాదాపు రూ. 624 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 770 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. గత రెండు రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 875 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌  రూ. 1,123 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 693 కోట్లు ఇన్వెస్ట్‌చేస్తే, దేశీ ఫండ్స్‌ రూ. 206 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే.  

 Most Popular