మళ్లీ కొత్త గరిష్టాలకు- మార్కెట్‌ @రికార్డ్‌ హై!

మళ్లీ కొత్త గరిష్టాలకు- మార్కెట్‌ @రికార్డ్‌ హై!

రోజంతా కన్సాలిడేషన్‌ బాటలో సాగిన మార్కెట్లు చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. తద్వారా మరోసారి సరికొత్త రికార్డులను అందుకున్నాయి. ఒడిదొడుకుల మధ్య కదిలిన సెన్సెక్స్‌ ట్రేడింగ్ ముగిసేసరికి 70 పాయింట్లు పెరిగి 34,503 వద్ద నిలిచింది. నిఫ్టీ 19 పాయింట్లు బలపడి 10,651 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు సైతం రికార్డు గరిష్టాలకు చేరడం విశేషం!
రియల్టీ జోరు
ఎన్‌ఎస్‌ఈలో అత్యధికంగా రియల్టీ 2 శాతం జంప్‌చేయగా.. పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఎఫ్‌ఎంసీజీ 0.35 శాతం పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఇన్ఫోసిస్‌, ఐబీ హౌసింగ్‌, భారతీ, కొటక్‌ బ్యాంక్‌, ఐషర్‌, టెక్‌ మహీంద్రా, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌యూఎల్‌, యస్‌బ్యాంక్‌ 2.3-0.8 శాతం మధ్య బలపడ్డాయి. మరోపక్క విప్రో, ఇండస్‌ఇండ్, అంబుజా, సిప్లా, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌పీసీఎల్‌, ఐసీఐసీఐ, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌, హీరోమోటో 2-0.5 శాతం మధ్య బలహీనపడ్డాయి. 
చిన్న షేర్లు ఓకే
బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇండెక్సులు 0.3 శాతం చొప్పున బలపడ్డాయి. ట్రేడైన మొత్తం షేర్లలో 1603 లాభపడితే.. 1327 నష్టపోయాయి.
ఎఫ్‌పీఐల అమ్మకాలు..
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 572 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 600 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 304 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌  రూ. 523 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. ఇక సోమవారం ఎఫ్‌పీఐలు దాదాపు రూ. 693 కోట్లు ఇన్వెస్ట్‌చేస్తే, దేశీ ఫండ్స్‌ రూ. 206 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విషయం విదితమే.Most Popular