నిఫ్టీ 600 పాయింట్లు పెరిగితే.. ఈ స్టాక్స్ 400% పెరిగాయ్

నిఫ్టీ 600 పాయింట్లు పెరిగితే.. ఈ స్టాక్స్ 400% పెరిగాయ్

స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. వేల్యుయేషన్స్ అధికంగా ఉన్నాయని అందరూ లోలోపల అనుకుంటున్నారే కానీ మార్కెట్ మాత్రం పైపైకి పరుగులు తీస్తోంది. 10 వేల పాయింట్ల నుంచి 10 వేల 600 పాయింట్ల వరకూ జోరు ఎక్కడా ఆగినట్టు కనిపించలేదు.  మధ్యలో మార్కెట్ కాస్త కన్సాలిడేషన్‌లో ఉన్నప్పటికీ కొన్ని స్టాక్స్ మాత్రం ఇరగదీశాయి. ఆకాశమే హద్దుగా ఆవేశంగా పెరిగాయి. ఇన్వెస్టర్లలో చాలా మంది 30, 40 శాతం లాభాలకే అమ్మేశారు కానీ ఇవి మాత్రం జోరును కొనసాగించాయి. 
నిఫ్టీ 10 వేల నుంచి 10వేల 600 కు చేరుకునేందుకు సుమారు ఆరు నెలల సమయం పట్టింది. ఇదే సమయంలో సుమారు 30 స్టాక్స్ 10 రెట్లు పెరిగాయి. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 

మినిమంలో మినిమం 60 శాతం పెరిగిన స్టాక్స్ కొన్నైతే.. మరికొన్ని 500 శాతం వరకూ కూడా పెరిగాయి. వీటిల్లో బీఎస్ఈ 500 ఇండెక్స్‌లో ఉన్న జైకార్ప్, విఐపి ఇండస్ట్రీస్, దివీస్ ల్యాబ్స్, కెఈఐ ఇండస్ట్రీస్, టోరెంట్ పవర్, అదానీ ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి. 

హెచ్ఈజీ, గ్రాఫైట్ ఇండియా, రెయిన్ ఇండస్ట్రీస్, బాంబే డయింగ్, ఫిలిప్స్ కార్బన్, బాంబే డయింగ్ వంటివి ఉన్నాయి. 

ఏడాదిలో నిఫ్టీ 29 శాతం పెరిగింది. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 35 నుంచి 40 శాతం వరకూ లాభాలను పంచి అందరినీ ఆశ్చర్యపరిచాయి. అయితే ఈ ఏడాది కూడా అదే స్థాయిలో లాభాలు, రాబడి ఉంటాయా అంటే మాత్రం చెప్పడం కష్టం. 

మొత్తానికి వీటిల్లో ఒక్క స్టాక్‌ను హోల్డ్ చేసుకున్నా కూడా భారీ లాభాలను ఇన్వెస్టర్లు మూటగట్టుకున్నట్టే లెక్క. Most Popular