ఏడాది ఫార్వార్డ్ పీఈ ప్రకారం.. నిఫ్టీతో పోల్చితే మిడ్‌క్యాప్ ఇండెక్స్ 30 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది. 10ఏళ్ల సగటు ప్రకారం చూసుకుంటే 10 శాతం డిస్కౌంట్‌తో ఉండాల్సిన సూచీ, ప్రస్తుతం ప్రీమియంతో ట్రేడవుతున్న విషయాన్ని గమనించాలి.
మిడ్‌క్యాప్ వాల్యుయేషన్స్ గణనీయంగా పెరిగాయని చెప్పేందుకు ఇది నిదర్శనం. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సీఎల్ఎస్ఏ కూడా ఇదే విషాయన్ని చెబుతోంది. అయితే మిడ్‌క్యాప్ స్పేస్‌లో పలు నాణ్యమైన, ఇంకా అభివృద్ధికి అవకాశం ఉన్న స్టాక్స్ గలవని చెబుతోంది. మిడ్‌క్యాప్/స్మాల్‌క్యాప్ రంగాల్లోని స్టాక్స్‌పై మ్యూచువల్ ఫండ్ కంపెనీలు దృష్టి పెట్టిన విషయాన్ని గుర్తు చేస్తోంది.
రాబోయే నెలలలో మరిన్ని మిడ్‌క్యాప్స్ స్టాక్స్‌ను దేశీయ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ హౌస్‌లు, స్కీమ్‌లు కొనుగోలు చేసే అవకాశం ఉందని సెబీ తాజా సర్క్కులర్ చెబుతోంది. ఇలాంటి సమయంలో మిడ్‌క్యాప్ స్పేస్‌లో ఆకర్షణీయంగా ఉన్న పలు స్టాక్స్‌ను పరిశీలిద్దాం.
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్:
దేశీయంగా టాప్-4 అప్పెరల్ బ్రాండ్స్.. వాల్యూ-ఫ్యాషన్ రిటైల్ నెట్‌వర్క్‌ను సమపాళ్లలో కలిగి ఉన్న సంస్థ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ & రిటైల్. మదుర డివిజన్లో సేమ్ స్టోర్ సేల్స్ గణనీయంగా పెరుగుతున్నాయి. పాంటలూన్స్ స్టోర్స్ సంఖ్యను పెంచుకునేందుకు కంపెనీలు ప్రయత్నాలు సాగిస్తోంది.
క్రాంప్టన్ కన్జూమర్:
ఈ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న కంపెనీగా ఎదిగే లక్ష్యాన్ని కంపెనీ నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఉన్న విభాగాలతో పాటు.. మరిన్ని ఉత్పత్తులను లాంఛ్ చేయడం ద్వారా తమ పోర్ట్‌ఫోలియోను విస్తరించుకునేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది.
సెంచరీ ప్లైబోర్డ్స్:
ప్లైవుడ్ రంగంలో మార్కెట్ లీడర్‌గా ఉన్న సెంచరీ ప్లైబోర్డ్స్.. పూర్తిస్థాయి ఇంటీరియర్-ఇన్ఫ్రాస్ట్రక్చర్-సొల్యూషన్స్ ప్రొవైడర్‌గా కంపెనీ ఎదుగుతోంది. బ్రాండ్ స్ట్రెంగ్త్‌తో పాటు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను కూడా పెంచుకుంటోంది.
జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్:
కన్జూమర్ సెంటిమెంట్ రికవర్ కావడం, అభివృద్ధిపై ఫోకస్ చేయడం వంటివి కంపెనీ లాభదాయకత పెరిగేందుకు కారణం అవుతున్నాయి. రాబోయే కాలంలో ఆదాయాలు మరింతగా పెరుగుతాయని అంచనాలు వినిపిస్తున్నాయి.
అపోలో హాస్పిటల్స్:
ప్రస్తుత, కొత్త ఆస్పత్రుల టర్నోవర్ విషయంలో టర్న్అరౌంట్ కనిపిస్తోందని అపోలో హాస్పిటల్స్ చెబుతోంది.
ఒబెరాయ్ రియాల్టీ:
రెరా చట్టం అమలు తర్వాత సంస్థాగత విక్రయదారుల వైపు వినియోగదారులు మారుతుండడం కంపెనీకి సానుకూలం.
గోద్రెజ్ ప్రాపర్టీస్:
రెరా చట్టం గోద్రెజ్ ప్రాపర్టీస్ షేర్‌కు కూడా సానుకూలమే.
గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన రికమెండేషన్స్‌ను సీఎల్ఎస్ రిపోర్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. వీటిలో పెట్టుబడులకు ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్.ఇన్ బాధ్యత వహించదు. పెట్టుబడులు చేసే ముందు మార్కెట్ ఎక్స్‌పర్ట్‌ల సలహా తీసుకోండి.