సగానికి సగం దిగొచ్చిన 51 స్టాక్స్.. వీటిలో ఏవైనా కొనచ్చా??

సగానికి సగం దిగొచ్చిన 51 స్టాక్స్.. వీటిలో ఏవైనా కొనచ్చా??

దేశీయంగా లిక్విడిటీ, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి లభిస్తున్న మద్దతు ప్రభావంతో.. మన మార్కెట్లు ఆల్‌టైం రికార్డులతో దూసుకుపోతున్నాయి. 
ప్రస్తుతం మార్కెట్ల పరుగుల ఆధారంగా.. మూమెంటం బేస్డ్‌ ట్రేడింగ్, ఇన్వెస్టింగ్ చేసేందుకు మదుపర్లు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువమంది హై-పెర్ఫామెన్స్ స్టాక్స్‌వైపే మొగ్గు చూపుతున్నారు. 
ప్రస్తుతం వాల్యుయేషన్స్ గణనీయంగా పెరిగిపోవడంతో ఇలాంటి స్టాక్స్‌లో పెట్టుబడులు రిస్క్ అనే మాట తరచుగా వినిపిస్తోంది. అయితే, ఇంతటి ర్యాలీలో కూడా భారీగా పతనమైన స్టాక్స్‌లో అవకాశాలను పరిశీలించవచ్చనే మాటలు వినిపిస్తున్నాయి.


2017లో ఏడాది గరిష్ట స్థాయి నుంచి భారీగా పతనం అయి, కనీసం 50 శాతం కంటే ఎక్కువగా పతనమైన 51 స్టాక్స్ జాబితాను చూద్దాం. ఇందులో రూ. 100 కోట్ల కంటే తక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన మైక్రోక్యాప్స్‌ను తొలగించడం జరిగింది. 

అయితే.. భారీ డిస్కౌంట్‌లో లభిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఈ స్టాక్స్‌ను తీసుకోవాలా వద్దా అనే ప్రశ్న ఎదురుకావడం సహజమే. మార్కెట్లు భారీ ర్యాలీ చేసిన సమయంలో కూడా పెర్ఫామ్ చేయలేకపోగా.. భారీగా పతనం అయిన  వాటిలో పెట్టుబడులు అంటే రిస్క్‌‌తో కూడుకున్న వ్యవహారం అనడంలో సందేహం అక్కర్లేదు.

ఏడాది గరిష్టం నుంచి భారీగా పతనమైన స్టాక్స్ 

అయితే.. అద్భుతమైన ఫలితాలు కాకపోయినా, అమ్మకాలలో కనీసం రెండంకెల వృద్ధి సాధించిన కంపెనీలు.. ఫ్యూచర్‌లో బెటర్‌గా పెర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. 

 

ఆ రెండు స్టాక్స్

ఇలాంటి వాటి కోసం ఈ 51 స్టాక్స్‌ను జల్లెడ పడితే.. కేవలం 2 స్టాక్స్‌ మాత్రమే కనిపించడం విశేషం. కుషాల్, పిన్‌కాన్ స్పిరిట్స్ మాత్రమే రెండంకెల అమ్మకాల వృద్ధి సాధించి, భవిష్యత్తులో కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గత మూడేళ్లలో 1574 శాతం మేర కుషాల్ పెరగగా.. పిన్‌కాన్ స్పిరిట్స్ 80 శాతం వృద్ధితో నిలకడ ప్రదర్శించింది. అమ్మకాలు, నికరలాభాలను పరిశీలిస్తే ఈ రెండు కంపెనీలు గత మూడేళ్లలో 40 శాతం వృద్ధి సాధించగలగడం విశేషం.Most Popular