నేటి నుంచీ అపోలో మైక్రోసిస్టమ్స్‌ ఐపీవో!

నేటి నుంచీ అపోలో మైక్రోసిస్టమ్స్‌ ఐపీవో!

వైమానిక, రక్షణ, రవాణా రంగాలకు సమీకృత సేవలు అందిస్తున్న హైదరాబాద్‌ సంస్థ అపోలో మైక్రోసిస్టమ్స్‌ పబ్లిక్ ఇష్యూ నేడు(10న) ప్రారంభంకానుంది. ఈ శుక్రవారం(12న) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ. 270-275కాగా... తద్వారా కంపెనీ రూ. 156 కోట్లను సమీకరించాలని ఆశిస్తోంది. 2017లో ఐపీవోల ద్వారా దేశీ కార్పొరేట్‌ సంస్థలు సమారు రూ. 75,000 కోట్లను సమీకరించిన విషయం విదితమే. 

యాంకర్‌ నిధులు
ఐపీవోకి ముందు రోజు అంటే మంగళవారం అపోలో మైక్రోసిస్టమ్స్‌ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి దాదాపు రూ. 47 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 275 ధరలో దాదాపు 17 లక్షల షేర్లను కేటాయించింది. యాంకర్‌ సంస్థలలో సుందరం ఎంఎఫ్‌, జూపిటర్‌ సౌత్‌ ఆసియా ఇన్వెస్ట్‌మెంట్‌ తదితరాలున్నాయి.

రిటైలర్లకు డిస్కౌంట్‌
షేరు ముఖ విలువ రూ. 10కాగా..  ఇష్యూలో భాగంగా అపోలో మైక్రో.. అర్హతగల ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేరు ధరలో రూ. 12 డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తోంది. రిటైలర్లు కనీసం 50 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆపై రూ. 2 లక్షల మొత్తానికి మించకుండా అప్లై చేసుకోవచ్చు. 

కంపెనీ వివరాలివీ
హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు కలిగిన అపోలో మైక్రోసిస్టమ్స్‌ ప్రధానంగా ఎలక్ట్రానిక్‌, ఎలక్ట్రో మెకానికల్‌, ఇంజినీరింగ్‌ డిజైన్లతో మిషన్‌, టైమ్‌ క్రిటికల్‌ సొల్యూషన్స్‌ అందిస్తోంది. మార్చితో ముగిసిన 2016-17లో ఆదాయం రూ. 212 కోట్లకు చేరగా..  రూ. 18 కోట్లకుపైగా నికర లాభం ఆర్జించింది. రూ. 13 ఈపీఎస్‌ సాధించింది. కాగా.. ఐపీవో నిధులను అదనపు వర్కింగ్‌ కేపిటల్‌తోపాటు.. సాధారణ పాలనా అవసరాలకూ వినియోగించనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. Most Popular