10700 దిశగా నిఫ్టీ, 10 రోజుల్లో 17% లాభాలిచ్చే పిక్స్

10700 దిశగా నిఫ్టీ, 10 రోజుల్లో 17% లాభాలిచ్చే పిక్స్

2018 సంవత్సరం మార్కెట్లకు పాజిటివ్‌గానే మొదలైంది. బెంచ్‌మార్క్ సూచీలు రికార్డులను సృష్టిస్తూ దుసుకుపోతున్నాయి. ఈ క్యాలెండర్ ఇయర్ తొలివారంలోనే కొత్త గరిష్టాలు తాకిన నిఫ్టీ.. ఆ తర్వాత కూడా ర్యాలీ చేస్తోంది. 10700 మార్క్ దిశగా నిఫ్టీ దూసుకుపోతోంది. 
10500 లెవెల్‌ను స్టాప్‌లాస్‌గా పరిగణించి.. లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలని ఎనలిస్ట్‌లు సూచిస్తున్నారు. బ్యాంక్ నిఫ్టీ నుంచి కూడా సపోర్ట్ లభిస్తుండడంతో.. మార్కెట్లు మరింతగా ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. 
ఈ మూమెంటం ప్రకారం 10700-10800 స్థాయిని కొన్ని రోజుల వ్యవధిలోనే నిఫ్టీ అందుకునే అవకాశం ఉండగా.. 10350 దిగువకు చేరుకోనంత వరకూ స్ట్రెంగ్త్ ఉన్నట్లే అని టెక్నికల్ ఎనలిస్ట్‌లు సూచిస్తున్నారు. ఇలాంటి సమయంలో షార్ట్‌టెర్మ్‌లో 17 శాతం రిటర్న్స్ ఇవ్వగల స్టాక్స్‌ జాబితాను ఓసారి చూద్దాం.

 

లైకా ల్యాబ్స్: BUY| టార్గెట్ రూ. 87| స్టాప్‌లాస్ రూ. 64.50| గడువు 5-10 సెషన్స్| రాబడి అవకాశం 15 %
చిన్న సైజు మిడ్‌క్యాప్ కౌంటర్లలో గత కొన్ని ట్రేడింగ్ సెషన్లుగా బయింగ్ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇందులోకి ఎంటర్ అయేందుకు ఈ స్టాక్‌కు కొంచెం సమయం పట్టినా.. మెల్లగా పార్టిసిపేట్ చేయడం ప్రారంభించింది. ఎక్కువ వాల్యూమ్స్‌తో ప్రైస్ యాక్షన్ కనిపించడం ఈ స్టాక్‌కు సానుకూల అంశంగా చెప్పవచ్చు.

 

డిష్ టీవీ: BUY| టార్గెట్ రూ. 93| స్టాప్‌లాస్ రూ. 81| గడువు 5-10 సెషన్స్| రాబడి అవకాశం 10 %
నాలుగు వారాల కన్సాలిడేషన్ జోన్‌ నుంచి రీసెంట్‌గానే ఈ స్టాక్ బయటకు వచ్చింది. ఎక్కువ వాల్యూమ్స్ కూడా నమోదవుతున్నాయి. రూ. 82.50కు ఎగువన బ్రేకవుట్ పాయింట్ ఉండగా.. బయింగ్‌ ఇంట్రెస్ట్ అంతకంతకూ పెరుగుతోంది.

 

వోల్టాస్: SELL| టార్గెట్ రూ. 612| స్టాప్‌లాస్ రూ. 661| గడువు 5-10 సెషన్స్| రాబడి అవకాశం 5 %
గత 12 నెలలుగా ఈ స్టాక్‌లో భారీ ర్యాలీ కనిపిస్తోంది. రికార్డు గరిష్టాలను కూడా నమోదు చేసిన ఈ స్టాక్, లాంగ్‌టెర్మ్‌కోసం బుల్లిష్‌గానే ఉన్నా, స్వల్ప కాలానికి మాత్రం కరెక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 

 

భారత్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్: BUY| టార్గెట్ రూ. 1140| స్టాప్‌లాస్ రూ. 950| గడువు 1-2 months| రాబడి అవకాశం 10 %
గతేడాది ఇదే సమయానికి 52వారాల కనిష్ట స్థాయిలో ఉన్న ఈ స్టాక్.. అక్టోబర్ నాటికి ఏడాది గరిష్టాన్ని అందుకుంది. అక్కడి నుంచి స్థిరంగా ఉన్న ఈ స్టాక్‌లో.. ఇప్పుడు మళ్లీ కదలిక వచ్చే అవకాశాలు ఉన్నాయి.

 

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్: BUY| టార్గెట్ రూ. 120| స్టాప్‌లాస్ రూ. 92| గడువు 1-2 months| రాబడి అవకాశం 17 %
గతేడాది ఏప్రిల్‌లో ఏడాది గరిష్టాన్ని అందుకున్న ఈ స్టాక్, ఆగస్ట్ నాటికి భారీగా పతనమయ్యి 52వారాల కనిష్టానికి పడిపోయింది. గరిష్ట స్థాయిల నుంచి భారీగా తగ్గిన ఈ స్టాక్‌లో స్వింగ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. Most Popular