3 ఏళ్లలో 10 రెట్లు పెరిగాయ్‌.. ఇంకా స్కోప్ ఉందట!

3 ఏళ్లలో 10 రెట్లు పెరిగాయ్‌.. ఇంకా స్కోప్ ఉందట!

నిఫ్టీ 500 ఇండెక్స్‌లో 150కి పైగా స్టాక్స్.. గత మూడేళ్లలో మదుపర్ల సంపదను రెట్టింపునకు పైగా పెంచాయి. వీటిలో మిందా ఇండస్ట్రీస్, ఇండియాబుల్స్ వెంచర్స్, రెయిన్ ఇండస్ట్రీస్‌లు 1000 శాతానికి పైగా పెరిగాయి. అంటే 2015 జనవరి ప్రారంభంలో రూ. 10000 పెట్టుబడి చేస్తే.. ఇప్పుడు ఆ మొత్తం రూ. 1 లక్షను దాటిపోయిందన్న మాట. 

 

మిందా ఇండస్ట్రీస్

1010 శాతం లాభపడిన మిందా ఇండస్ట్రీస్.. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. 2015 జనవరి 2న రూ. 113గా ఉన్న ఈ స్టాక్.. ఇప్పడు రూ. 1257కు పెరిగింది. ఈ సమయంలో ఎన్‌ఎస్ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ నిఫ్టీ 24 శాతం మాత్రమే పెరిగింది. ఎలక్ట్రిక్ వెహికల్ రంగంలో సత్తా చాటేందుకు తగిన ప్రణాళికలను రూపొందించుకున్న ఈ కంపెనీ.. ఎలక్ట్రిక్ వెహికల్ కాంపొనెంట్స్ తయారీలో దూసుకోపోతోంది. మరిన్న కాంపొనెంట్స్ తయారు చేసేందుకు మిందా ఇండస్ట్రీస్ సిద్ధం అవుతుండడం.. ఈ స్టాక్‌కు సానుకూలం అని బ్రోకరేజ్ హౌస్ ఐఐఎఫ్ఎల్ అంటోంది.

 

ఇండియా బుల్స్ వెంచర్స్

973 శాతం లాభంతో ఇండియాబుల్స్ వెంచర్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. 2015 ప్రారంభంలో రూ. 24.20 గా ఉన్న ఈ స్టాక్.. ఇప్పుడు రూ. 259.65కు చేరుకుంది. పలు డిపాజిటరీ సంబంధిత కార్యకలాపాలతో పాటు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలకు షేర్‌బ్రోకర్‌గా ఈ కంపెనీ వ్యవహరిస్తుంది.

 

రెయిన్ ఇండస్ట్రీస్
ఇదే కాలంలో రెయిన్ ఇండస్ట్రీస్ 922 శాతం ర్యాలీ చేసింది. వాల్యూ ఇన్వెస్టర్స్ అయిన మొహ్‌నీష్ పబ్రాయ్, డాలీ ఖన్నాలు రెయిన్ ఇండస్ట్రీస్‌ను తమ ఫేవరేట‌్‌గా చెబుతారు. రూ. 42 నుంచి రూ. 438వరకూ ఈ స్టాక్ పెరిగింది. సెప్టెంబర్ 2017నాటికి డాలీఖన్నాకు ఈ కంపెనీలు 2.04 శాతం వాటా ఉండగా.. పబ్రాయ్‌ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్2కు 3.76 శాతం, పబ్రాయ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్3కు 4.83 శాతం వాటా ఉన్నాయి. రెయిన్‌ ఇండస్ట్రీస్‌కు రూ. 492 టార్గెట్‌తో బయ్ రేటింగ్‌ను ఇచ్చింది మోతీలాల్ ఓస్వాల్.

 

ఇతర షేర్లు

అవంతి ఫీడ్స్, క్యాప్లిన్ పాయింట్, దాల్మియా భారత్, వక్రాంజీ, ఏజీస్ లాజిస్టిక్స్, నవీన్ ఫ్లోరో, ఏపీఎల్ అపోలో, ఎస్కార్ట్స్, స్టెర్‌లైట్ టెక్నాలజీస్ షేర్లు ఈ మూడేళ్ల కాలంలో 500 నుంచి 700 శాతం మధ్య పెరిగాయి.

 

వెల్త్ డిస్ట్రాయర్స్

అయితే విడియోకాన్ ఇండస్ట్రీస్, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, యూకో బ్యాంక్, అదాని ఎంటర్‌ప్రైజెస్, జస్ట్ జయల్ షేర్లు 50 శాతంపైగా మదుపర్ల సంపదను హరించివేశాయి.Most Popular