మూడు వారాల్లో 25శాతం రాబడి ఇవ్వగల స్టాక్స్!!

మూడు వారాల్లో 25శాతం రాబడి ఇవ్వగల స్టాక్స్!!

2018 సంవత్సరం మార్కెట్లకు సానుకూలంగానే మొదలైంది. గత వారం కనిష్ట స్థాయి 10460ను బ్రేక్ చేసి, కీలక నిరోధాలను అధిరోహించి, ఆల్‌టైం హై లెవెల్‌ను నిఫ్టీ అందుకోగలిగింది. క్లోజింగ్ బేసిస్‌లో 10500 పాయింట్ల మార్క్‌ను కూడా అధిరోహించింది.
అయితే నిఫ్టీ ఆల్‌టైం హైలెవెల్‌ను దాటినా.. బ్యాంక్ నిఫ్టీ ఇంకా గత గరిష్టం 25,954కు దిగువనే ఉంది. అంటే డౌ సిద్ధాంతం ప్రకారం నిఫ్టీలో ఈ మూమెంటంను బ్యాంక్ నిఫ్టీ ఇంకా సపోర్ట్ చేయడం లేదు.గత వారంలో లార్జ్‌క్యాప్స్‌లో కొనుగోళ్లు ఈ ర్యాలీకి సహకరించాయి. కానీ 10,500, 10600స్థాయిలో కాల్ రైటింగ్ ఆప్షన్ ఎక్కువగా కనిపించడంతో, ఈ స్థాయిని అధిరోహించడం కొంత కష్టమైన విషయంగా చెప్పవచ్చు

ఈ పరిస్థితిలో 10400 పాయింట్ల స్థాయి కీలక మద్దతుగా వ్యవహరించనుంది. ఈ లెవెల్‌ను కోల్పోతే నిఫ్టీలో మరింతగా పతనం కనిపించవచ్చు. అపుడు 10300-10270 వరకూ నిఫ్టీ కరెక్షన్‌కు గురి కావచ్చు.
మరోవైపు 10600 పాయింట్ల స్థాయి వద్ద నిఫ్టీకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎదురుకానుంది. ఇలాంటి సమయంలో రాబోయే మూడు నాలుగు వారాల సమయంలో 25 శాతం రాబడులు అందించగల స్టాక్స్ జాబితాను చూద్దాం.

 

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్: BUY above రూ. 383| టార్గెట్ రూ. 410| స్టాప్‌లాస్ రూ. 370| గడువు 8-10 సెషన్స్| రాబడికి అవకాశం 7.8%
డైలీ ఛార్టుల ప్రకారం లోయర్ బాటమ్ ఫార్మేషన్‌ను చూపిన ఈ స్టాక్ ఒత్తిడిలో ఉంది. అయితే ఆర్ఎస్ఐ మూమెంటం ఇండికేటర్ దీన్ని కన్ఫాం చేయలేదు. అలాగే బుల్లిష్ డైవర్జెన్స్ ప్యాటర్న్‌కు సిగ్నల్ ఇచ్చింది.

 

ఆర్‌సీఎఫ్: BUY around రూ. 103.50 / 101.50| టార్గెట్ రూ. 115 / 120| స్టాప్‌లాస్ రూ. 94.90| గడువు 15-21 సెషన్స్| రాబడికి అవకాశం 16%
అతి తక్కువ రేంజ్‌లో కన్సాలిడేషన్‌కు గురవుతున్న ఈ స్టాక్, డిసెండింగ్ ట్రయాంగిల్‌ ప్యాటర్న్‌ను.. వీక్లీ ఛార్టులలో చూపింది. గత వారంలో ఈ స్టాక్ బ్రేకవుట్‌ను కన్ఫాం చేసింది కూడా. వాల్యూమ్స్ పెరగడంతో వీక్లీ బొలింగర్ బ్యాండ్ విస్తరించడం ప్రారంభించింది. 

 

స్నోమ్యాన్ లాజిస్టిక్స్: BUY at రూ. 61 | టార్గెట్ రూ. 76| స్టాప్‌లాస్ రూ. 54.30| గడువు 15-21 సెషన్స్| రాబడికి అవకాశం 25%
తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న ఈ స్టాక్.. ఆల్‌టైం హె లెవెల్ అయిన రూ. 134 నుంచి కరెక్షన్‌కు గురయింది. అలాగే 52 వారాల కనిష్ట స్థాయి రూ. 46కు పడిపోయి అక్కడినుంచి రీబౌండ్ అయింది. గత కొంతకాలంగా ఈ స్టాక్‌లో స్ట్రాంగ్ బయింగ్ ఇంట్రెస్ట్ కనిపిస్తోంది.

 

బ్రిటానియా ఇండస్ట్రీస్: SELL below రూ. 4595| టార్గెట్ రూ. 4270| స్టాప్‌లాస్ రూ. 4740| గడువు 15-20 సెషన్స్| రాబడికి అవకాశం 7%
డైలీ ఛార్టుల ప్రకారం చూస్తే గత కొన్ని నెలలుగా ఈ స్టాక్ అద్భుతమైన ర్యాలీ చేస్తోంది. ఇదే ఊపులో తాజా ఆల్‌టైం గరిష్ట స్థాయి రూ. 4964ను కూడా ఈ స్టాక్ తాకింది. ఈ స్థితిలో బుల్లిష్ మూమెంటం పూర్తి కావడంతో, తగినంతగా ప్రాఫిట్‌బుకింగ్ చోటు చేసుకుంది. ఇక్కడి నుంచి తిరిగి ర్యాలీ చేసే అవకాశాలు ఉన్నాయి.
 Most Popular