కట్టిన ప్రీమియం తిరిగిచ్చేసే టెర్మ్ ప్లాన్స్!

కట్టిన ప్రీమియం తిరిగిచ్చేసే టెర్మ్ ప్లాన్స్!

రావాల్సిన దానికంటే కాసింత ఎక్స్‌ట్రాగా ఏదైనా వస్తే మన దేశంలో జనాలు ఫుల్లు హ్యాపీగా ఫీలయిపోతారు. అందుకే ఫెస్టివల్ డిస్కౌంట్లు, లాంఛింగ్ ఆఫర్లు మన దగ్గర బాగా క్లిక్ అవుతాయి. మరి ఇలాంటివి ఇన్సూరెన్స్ రంగంలో వర్తిస్తాయా అంటే.. కష్టమే అనుకుంటారు అంతా.
టెర్మ్ ఇన్సూరెన్స్ అంటే జనాల దగ్గర ఓ క్లారిటీ ఉంది. సాధారణ బీమా ప్రీమియంలతో పోల్చితే అతి తక్కువ మొత్తానికే ఎక్కువ బీమా సౌలభ్యాన్ని టెర్మ్ పాలసీలు కల్పిస్తాయి. అయితే, ఈ టెర్మ్ పాలసీల గడువు ముగిసిన తర్వాత.. ఆ పాలసీ ముగిసిన సమయానికి బీమా పొందిన వ్యక్తి జీవించి ఉన్నట్లయితే, వారికి ఎటువంటి క్లెయిమ్స్ అందవు.

 

రిటర్న్ ఆఫ్ ప్రీమియం
టెర్మ్ పాలసీలలో ప్రీమియం మొత్తం వెనక్కు రాదనే అందరూ భావిస్తారు. కానీ చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని తిరిగి వెనక్కు ఇచ్చే ఆప్షన్స్ ఉంటాయనే సంగతి అందరికీ తెలియకపోవచ్చు. దీన్నే రిటర్న్ ఆఫ్ ప్రీమియం(ROP) ప్లాన్స్ అంటారు. పేరుకు తగ్గట్లుగానే.. మెచ్యూరిటీ బెనిఫిట్ రూపంలో చెల్లించిన ప్రీమియం వరకూ అందచేస్తాయి బీమా కంపెనీలు.
అంటే టెర్మ్ పాలసీకి చెల్లించిన ప్రీమియం కూడా వెనక్కు వస్తుందన్న మాట. అయితే, సాధారణ టెర్మ్ పాలసీలతో పోల్చితే వీటికి ప్రీమియం మొత్తం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని మరచిపోకూడదు.
మీ కుటుంబంలో మీరే ప్రధాన ఆదాయవనరు అయితే, తప్పనిసరిగా టెర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోమని ఇన్వెస్ట్‌మెంట్ ఎక్స్‌పర్ట్ చెబుతారు. కానీ ప్రతీ వ్యక్తికి అవసరాలు విభిన్నంగా ఉంటాయి. ఇన్సూరెన్స్ కవరేజ్‌గా ఎంతమొత్తం ఎంచుకోవాలనే అంశం, ఎలా విభిన్నంగా ఉంటుందో.. అలాగే ఇతర అంశాలు కూడా వైవిధ్యంగానే ఉంటాయి.

ఈ కింది అంశాలను పరిగణించి, టెర్మ్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు.

  • వార్షిక ఆదాయం
  • వివాహితులు/అవివాహితులు
  • ఆధారపడిన వ్యక్తు - పిల్లలు, తల్లిదండ్రులు
  • ఆర్థిక అంశాలను కుటుంబ సభ్యులు నిర్వహించగల సామర్ధఅయ్ం
  • గృహ రుణం, ఇతర అప్పులు

 

బీమా అంటే ఒక సైజులో ఉండి పలువురికి నప్పే కాన్సెప్ట్ మాదిరి కాదు. బేసిక్ టెర్మ్ ప్లాన్ అందరికి సరిపోకపోవచ్చు. రిటర్న్ తప్పనిసరిగా ఉండాలని భావించే వారికి ROP ప్లాన్ తీసుకోవడం సరైన ఐచ్ఛికం. మీ అవసరాలకు తగినట్లుగా తీసుకునే ప్లాన్‌ను కస్టమైజ్ చేసుకోవాలి.

మీ ఆర్థిక స్థితిగతులను అనుసరించి మీ టెర్మ్‌ను ఎఁచుకోవాలి. ఉదాహరణకు మీరు ఇంకా 30 ఏళ్ల పాటు లోన్ చెల్లించాల్సి ఉంటే, 30-ఏళ్ల టెర్మ్ లైఫ్ ప్లాన్‌ను ఎంచుకోవాలి. ఈ సమయంలో మీకు ఏదైనా జరిగితే, ఆ రుణం గురించిన భయం చెందాల్సిన అవసరం ఉండదు. అదే సమయంలో మీరు టెర్మ్ పూర్తయ్యే వరకూ జీవించి ఉంటే, మీరు చెల్లించిన ప్రీమియం తిరిగి అందుకోవచ్చు.

 

రైడర్స్- పన్ను ప్రయోజనం
అనేక రిటర్న్ ఆఫ్ ప్రీమియం పథకాలు కన్వర్షన్ ఆప్షన్‌తో పాటు ఇతర రైడర్లతో కలిసి లభిస్తాయి. సాధారణ టెర్మ్ ప్లాన్స్‌ మాదిరిగా కాకుండా, ప్రీమియం టెర్మ్‌ను మీకు అనుగుణంగా మార్చుకోవచ్చు. అయితే, ప్రీమియం మాత్రం అధికంగానే ఉంటుంది.
ఇలా తిరిగి అందుకున్న ప్రీమియం మొత్తంపై పాలసీహోల్డర్ ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ టెర్మ్ పాలసీ గడువులోనే పన్ను ప్రయోజనం పొందడం మాత్రమే కాకుండా, మెచ్యూరిటీ తర్వాత కూడా లబ్ధి పొందచ్చన్న మాట. అనేక బీమా కంపెనీలు పాలసీ కొనుగోలు సమయంలో వయసుపై పరిమితిని విధిస్తాయి. అందుకే వీలైనంత త్వరగా టెర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం ఉత్తమం. 50 ఏళ్ల వయసు దాటిన తర్వాత ఆర్ఓపీ టెర్మ్ ప్లాన్ కొనుగోలు చేయడం కష్టం అవుతుంది. అందుకే, మీరు ఇంకా 30లలో ఉన్నట్లయితే, మీకోసం ఓ ప్లాన్ను కస్టమైజ్ చేసుకుని కొనుగోలు చేయండి.

 

కంపెనీలు- పాలసీలు

హెచ్‌డీఎఫ్సీ లైఫ్2 ప్రొటెక్ట్ 3డీ ప్లస్.. అవీవా ఐషీల్డ్(ఆర్ఓపీ), పీఎన్‌బీ మెట్‌లైఫ్ మెట్ సురక్ష(టీఆర్ఓపీ), ఐడీబీఐ ఫెడరల్ లెవెల్ కవర్ విత్ ఆర్ఓపీ, ఏగాన్ రెలిగేర్ సేవ్‌గార్డ్, బిర్లా సన్‌లైఫ్ ప్రీమియం బ్యాక్, రిలయన్స్ స్పెషల్ టెర్మ్ ప్లాన్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్‌గార్డ్ విత్ ఆర్ఓపీ.. వంటి టెర్మ్ పాలసీలు చెల్లించిన ప్రీమియంను తిరిగి అందించే పథకాలను అందిస్తున్నాయి.
 Most Popular