250శాతం పెరిగినా, పరుగెడుతున్న స్మాల్‌క్యాప్!

250శాతం పెరిగినా, పరుగెడుతున్న స్మాల్‌క్యాప్!

ఓ స్టాక్ ఒక క్యాలెండర్ ఇయర్ మొత్తం ర్యాలీ చేయడం చిన్న విషయం కాదు. ఇంతగా ర్యాలీ చేసిన షేర్‌లో తర్వాతి ఏడాదిలో ఎలాంటి పెర్ఫామెన్స్ చూపిస్తుందనే సందేహాలు సహజమే. అయితే.. ఓ స్టాక్ మాత్రం గతేడాది ర్యాలీని కంటిన్యూ చేస్తూ.. ఈ ఏడాది ప్రారంభం నుంచే పరుగును కొనసాగిస్తోంది.
డైవర్సిఫైడ్ స్మాల్‌క్యాప్ విశాక ఇండస్ట్రీస్ షేర్ పరుగు పెడుతున్న తీరు మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్య పరుస్తోంది. 2017లో ఈ స్టాక్ 250శాతంపైగా పెరిగింది. ఇదే రంగానికి చెందిన ఇతర కంపెనీలు అయిన ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, హైద్రాబాద్ ఇండస్ట్రీస్, రామ్‌కో ఇండస్ట్రీస్‌లను ఔట్ పెర్ఫామ్ చేస్తూ దూసుకుపోతోంది.
ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా విశాక ఇండస్ట్రీస్‌లో ర్యాలీ కనిపిస్తోంది. తొలి ఐదు సెషన్స్‌లోనే 25 శాతం పెరిగింది ఈ స్టాక్.
యార్న్ కెపాసిటీని విస్తరించడం ఈ కంపెనీకి కలిసొచ్చే విషయంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తక్కువ ధరలో విస్తరణను పూర్తి చేయడం, ఎక్కువ రాబడి అందించే ప్రొడక్టులు, వర్కింగ్ క్యాపిటల్ ప్రోత్సాహక స్థితిలో ఉండడం, తగ్గుతున్న రుణాలు వంటివి 2018లో విశాక ఇండస్ట్రీస్‌కు సానుకూలంగా మారనున్నాయి.


2016 డిసెంబర్ 30న రూ. 184 వద్ద ఉన్న విశాక ఇండస్ట్రీస్.. 2017 డిసెంబర్ 29 నాటికి రూ. 652కు చేరుకుంది. ఇప్పుడు రూ. 770కు చేరుకోగా.. జనవరి 5నాటి ట్రేడింగ్‌లో గరిష్టంగా రూ. 803 లెవెల్‌ను అందుకుంది విశాక.
డిస్పోజబుల్ ఇన్‌కం పెరగడం, రూరల్ హౌసింగ్-మౌలిక రంగాలపై కేంద్రం జోరు చూపిస్తుండడం, కొత్త ప్రొడక్టులను లాంఛ్ చేయడం వంటింవి విశాక ఇండస్ట్రీస్‌ షేర్‌కు సహకరించనున్నాయని ఆనంద్ రాఠీ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెబుతోంది.
రూరల్ ఇండియన్స్ కొనుగోలు చేసే ఆస్బెస్టాస్ సిమెంట్ రేకులు, గ్లోబల్ ఇనిస్టిట్యూషనల్ కస్టమర్ల కోసం యార్న్, ఇనిస్టిట్యూషనల్ కస్టమర్ల కోసం ఫైబర్ సిమెంట్ ఫ్లాట్ ప్రొడక్ట్స్ అందిస్తూ.. ప్రతీ ఒక్కరికీ తగిన ఉత్పత్తలను తయారు చేసి విక్రయిస్తోంది విశాక ఇండస్ట్రీస్. వి-బోర్డ్, వి-ప్యానెల్స్ అంటూ రెండు బ్రాండ్స్ పై ఈ ప్రొడక్టులను విక్రయిస్తోంది కంపెనీ.


2017మార్చ్‌తో ముగిసిన ఏడాదికి కంపెనీ రూ. 40.80 కోట్ల నికర లాభం గడించింది. అంతకు ముందు ఏడాదితో పోల్చితే ఇది 67 శాతం ఎక్కువ. నికర అమ్మకాలు 3.3 శాతం తగ్గగా.. ఐదేళ్ల సీఏజీఆర్ 5.14 శాతంగా ఉంది.
2018 ఆర్థిక సంవత్సరానికి పన్ను తర్వాతి లాభం అంచనాలను 12 శాతానికి, 2109ఆర్థిక సంవత్సరానికి 13 శాతానికి పెంచినట్లు సెంట్రమ్ బ్రోకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత  ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలు అంచనాలను మించడం, స్ట్రాంగ్ ఔట్‌లుక్ కారణంగానే ఈ పెంపుదల అని సెంట్రమ్ చెబుతోంది.
 Most Popular