6-12 నెలల్లో సూపర్ రిటర్న్స్ ఇచ్చే మిడ్, స్మాల్‌క్యాప్స్

6-12 నెలల్లో సూపర్ రిటర్న్స్ ఇచ్చే మిడ్, స్మాల్‌క్యాప్స్

అక్టోబర్ 2107 నుంచి సూపర్ స్ట్రాంగ్ ప్రదర్శన కనబరిచిన నిఫ్టీ 9687 నుంచి 10490 స్థాయికి చేరుకుంది. మధ్యలో 4 వారాల పాటు కరెక్షన్‌కు గురైన దశలో 10,033 పాయింట్లకు దిగి వచ్చింది. మొత్తం ర్యాలీ చేసిన పాయింట్లలో దాదాపు 62 శాతం మేర కరెక్షన్‌కు గురైనా.. తిరిగి 3 వారాల సమయంలో లైఫ్‌టైం హై లెవెల్ 10,552ను నిఫ్టీ అందుకోవడం గమనించాలి.

ఈ రీట్రేస్‌మెంట్ ప్రకారం నిఫ్టీ 10,836 పాయింట్లను అందుకునే అవకాశం ఉందని టెక్నికల్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. ఈ బుల్లిష్ ర్యాలీలో రెండు అంశాలను గమనించాలని సూచిస్తున్నారు.

  1. క్రూడాయిల్ ధరలు పెరగడం, గ్లోబల్‌గా సప్లై మందగించడం, దేశీయంగా పెరిగిన ధరల ఒత్తిడి, వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు కోల్పోయేలా ఆర్బీఐ చర్యలు, ఎఫ్ఐఐ ఇన్‌ఫ్లోస్ తగ్గిపోవడం, పారిశ్రామిక వృద్ధి రేటు మందగమనం వంటి అనేక అంశాలు మార్కెట్లను కరెక్షన్‌కు గురి చేశాయి. అయితే ఎన్ని ప్రతికూల వార్తలు వచ్చినా.. సైకలాజికల్‌గా 10వేల పాయింట్ల కీలక దశను నిఫ్టీ నిలబెట్టుకుంది. 
  2. ఈ కరెక్షన్ సమయంలో మిడ్‌క్యాప్/స్మాల్‌క్యాప్ స్టాక్స్ ఔట్‌పెర్ఫామ్ చేయడం సెంటిమెంట్‌ను బలపరించిందని చెప్పవచ్చు.

ఇలాంటి సమయంలో వచ్చే కరెక్షన్స్‌ను కొనుగోలుకు అవకాశంగా పరిగణించాలని.. క్యూ3 ఎర్నింగ్స్, బడ్జెట్ ఎక్స్‌పెక్టేషన్స్ వంటివి మార్కెట్లపై సానుకూలంగా ప్రభావం చూపచ్చని, ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను ఇవి బలపరిచే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
గత వారంలో నిఫ్టీ ఆల్‌టైం రికార్డును టచ్ చేయగా.. పలు ఇండెక్స్‌లు ఇప్పటికే లైఫ్-టైం హై లెవెల్స్‌లో ట్రేడవుతున్నాయి. మిడ్‌క్యాప్ 100, స్మాల్‌క్యాప్ 100 సూచీలు ఇందుకు సూచికలుగా చెప్పవచ్చు.
నవంబర్ మధ్యలో, డిసెంబర్ ప్రారంభంలో నిఫ్టీ లోయర్ లో స్థాయిని తాకగా.. ఈ సమయంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు మాత్రం ఆ స్థాయికి రాలేదు. ఆ తర్వాత నిఫ్టీ హైయర్ హైస్‌ను చేరుకుంది.
బ్రాడర్ మార్కెట్స్‌లో ఇంకా బుల్లిష్ ట్రెండ్ ఉందని చెప్పేందుకు ఈ పాయింట్స్ సరిపోతాయి. ఈ సమయంలో రాబోయే 6-12 నెలల కాలంలో మంచి రిటర్న్స్ అందించే అవకాశం ఉన్న 3 స్టాక్స్‌ను పరిశీలిద్దాం.

 

ఈఐహెచ్ లిమిటెడ్: BUY |టార్గెట్ రూ. 180| స్టాప్‌లాస్ రూ. 125| గడువు 12 నెలలు
జనవరి 2008- ఆగస్ట్ 2013లో సంభవించిన మేజర్ ఫాల్ తర్వాత 50 శాతం రీట్రేస్మెంట్ చూపించిన ఈఐహెచ్ లిమిటెడ్.. గత రెండేళ్లుగా రూ. 91 -137 మధ్యనే కదలాడుతోంది. గతేడాది ఏప్రిల్-జూన్ కాలంలో బ్రేకవుట్ తీసుకున్న ఈ స్టాక్.. గత మూడు నెలలుగా స్ట్రాంగ్‌గా నిలబడింది. ఈ దశలో ఫ్రెష్ ఎంట్రీకి అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

 

చంబల్ ఫెర్టిలైజర్స్: BUY| టార్గెట్ రూ. 182.00| స్టాప్‌లాస్ రూ. 148| గడువు 6 నెలలు
రూ. 70 నుంచి రూ. 156 స్థాయికి గతేడాది తొలి 9 నెలల్లోనే చేరుకున్న చంబల్ ఫెర్టిలైజర్స్.. చివరి త్రైమాసికంలో మాత్రం కన్సాలిడేషన్ జోన్‌లోకి ప్రవేశించింది. ఈ దశలో రూ. 135-157 మధ్యనే నిలిచిన ఈ స్టాక్.. బ్రేకవుట్ తీసుకోవడంతో పాటు వాల్యూమ్ పరంగా కూడా బుల్లిష్ ధోరణిలోకి ప్రవేశించింది. 

 

మహరాష్ట్ర సీమ్‌లెస్: BUY| టార్గెట్ రూ. 578| స్టాప్‌లాస్ రూ. 491| గడువు 1 నెల
కన్సాలిడేషన్ ప్యాటర్న్‌ను బ్రేక్ చేసిన మహరాష్ట్ర సీమ్‌లెస్.. హెల్దీ బుల్ క్యాండిల్‌ను ఫామ్ చేసింది. వాల్యూమ్స్ కూడా గణనీయంగా పెరిగాయి. గత 200 సెషన్స్ సగటు వాల్యూమ్‌కు 5 రెట్లకు పైగా నమోదవుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లో ర్యాలీ తర్వాత కన్సాలిడేషన్‌కు గురైన ఈ స్టాక్‌లో మళ్లీ స్వల్ప కాలానికి ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. 

 

గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన రికమెండేషన్స్‌ను ఐసీఐసీఐ‌డైరెక్ట్.కాం రీసెర్చ్ టెక్నికల్ హెడ్ రాసిన వ్యాసం నుంచి తీసుకోవడం జరిగింది. ఈ రికమెండేషన్స్‌కు ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్.ఇన్ బాధ్యత వహించదు. పెట్టుబడులు చేసే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించండి.Most Popular