షార్ట్‌టెర్మ్‌లో 15పర్సెంట్ ప్రాఫిట్స్ ఇచ్చే బెస్ట్ బెట్స్!!

షార్ట్‌టెర్మ్‌లో 15పర్సెంట్ ప్రాఫిట్స్ ఇచ్చే బెస్ట్ బెట్స్!!

మార్కెట్లు ఈ వారంలో ఊగిసలాట ధోరణి కనబరుస్తున్నాయి. మూడు రోజుల పాటు ఇదే తరహాలో ట్రేడింగ్ జరిగింది. ప్రాఫిట్ బుకింగ్ కారణంగా 10550 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్ ఎదురవుతోంది. 10400 పాయింట్ల వద్ద స్ట్రాంగ్ సపోర్ట్ ఉండడం గమనించాయి. ఈ స్థాయికి వచ్చినపుడల్లా నిఫ్టీ బౌన్స్ బ్యాక్ అవుతోంది. 
రాబోయే సెషన్స్‌లో కూడా 10400-10550 మధ్య నిఫ్టీ కన్సాలిడేషన్‌కు గురి కావచ్చు. ఏ జోన్‌కు వైపు అయినా బ్రేకవుట్ లభిస్తే, అప్పుడు మార్కెట్ డైరెక్షన్‌పై ఒక అంచనాకు రావచ్చు. ప్రస్తుతం మార్కెట్ల సిట్యుయేషన్ ప్రకారం తగ్గినప్పుడల్లా కొనడం.. పెరిగినపుడల్లా అమ్మడం అనే వ్యూహమే సరైనది అని ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో షార్ట్‌టెర్మ్‌లో 15శాతం వరకు లాభాలు ఇచ్చే అవకాశం ఉన్న 5 స్టాక్స్‌ జాబితాను పరిశీలిద్దాం.

 

ఎస్‌హెచ్‌కే: BUY | టార్గెట్ రూ. 330 | స్టాప్‌లాస్ రూ. 270| లాభాలకు అవకాశం 12%
గత కొన్ని నెలలుగా ఈ స్టాక్ కన్సాలిడేషన్ ఫేజ్‌లో ఉంది. వీక్లీ ఛార్టులలో డబుల్ బాటమ్ తరహాలో ప్యాటర్న్‌ను ఫామ్ చేసిన ఈ స్టాక్, గత వారంలో స్ట్రాంగ్ వాల్యూమ్‌తో బ్రేకవుట్ తీసుకుంది. హైయర్ లెవెల్స్‌ వైపు మరికొంత కాలం ర్యాలీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

బీఎఫ్ యుటిలిటీస్: BUY | టార్గెట్ రూ. 540-580 | స్టాప్‌లాస్ రూ. 460| లాభాలకు అవకాశం 14%
షార్ట్‌టెర్మ్ అప్‌ట్రెండ్‌లో ఈ స్టాక్  ట్రేడవుతోంది. ప్రస్తుత ఛార్టుల ప్రకారం 50-ఈఎంఏ వద్ద సపోర్ట్ తీసుకుంటున్న ఈ స్టాక్.. మంచి వాల్యూమ్స్‌ను కూడా నమోదు చేసుకుంటోంది. బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్‌ కూడా కనిపించడంతో.. ఈ స్టాక్‌ మరికొన్ని రోజుల పాటు అప్‌సైడ్ వెళ్లే అవకాశం ఉంది.

 

కమిన్స్ ఇండియా: BUY | టార్గెట్ రూ. 955-980| స్టాప్‌లాస్ రూ. 890| లాభాలకు అవకాశం 5%
రూ. 840 వరకూ పతనం అయిన తర్వాత, రివర్సల్ తీసుకున్న ఈ స్టాక్.. అక్కడి నుంచి అప్‌సైడ్ కదులుతూనే ఉంది. అన్ని డీఎంఏలను బ్రేక్ చేయడంతో పాటు.. తాజాగా బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్‌ను కూడా దాటేసింది. సపోర్ట్ లెవెల్స్‌ కూడా బాగుండడంతో కొంత మేర పెరగవచ్చు.

 

జీఈ పవర్: BUY | టార్గెట్ రూ. 830 | స్టాప్‌లాస్ రూ. 650| లాభాలకు అవకాశం 13%
గత నాలుగు నెలలుగా స్వల్వ శ్రేణిలో కదులుతున్న ఈ స్టాక్.. కన్సాలిడేషన్ జోన్‌ నుంచి బ్రేకవుట్ తీసుకుని.. బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్‌ను చూపి మరీ అప్‌సైడ్ కదులుతోంది. వీక్లీ ఛార్టుల ప్రకారం కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ నమోదు చేసిన ఈ స్టాక్ షార్ట్‌టెర్మ్‌లో పెరిగే అవకాశాలున్నాయి.

 

హిందుస్తాన్ కాపర్: BUY | టార్గెట్ రూ. 115 | స్టాప్‌లాస్ రూ. 89| లాభాలకు అవకాశం 15%
నవంబర్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరించిన ఈ స్టాక్, రూ. 70 నుంచి రూ. 110 వరకూ ర్యాలీ చేసింది. ఆ తర్వాత హెల్దీ కరెక్షన్‌కు గురి కాగా.. రూ. 88 వరకు దిగి వచ్చింది. ప్రస్తుత చార్టింగ్ స్ట్రక్చర్ ప్రకారం చూస్తే.. ఈ లెవెల్‌లో రెండింతల సపోర్ట్ ఉందని.. బౌన్స్ బ్యాక్ కానుందని సూచిస్తోంది. 

 

గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన రికమెండేషన్స్ అన్నీ బొనాంజా పోర్ట్‌ఫోలియో లిమిటెడ్ సీనియర్ రీసెర్చ్ ఎనలిస్ట్ రాసిన వ్యాసం నుంచి స్వీకరించడం జరిగింది. ఈ స్టాక్స్‌లో ట్రేడింగ్‌ ద్వారా వచ్చే లాభనష్టాలపై ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్.ఇన్ బాధ్యత వహించదు. పెట్టుబడులు చేసే ముందు సర్టిఫైడ్ ఎక్స్‌పర్ట్ సలహాలు తీసుకోండి.
 Most Popular