గతేడాది పెర్ఫామ్ చేయని లార్జ్-క్యాప్స్‌ ఇకపై?!

గతేడాది పెర్ఫామ్ చేయని లార్జ్-క్యాప్స్‌ ఇకపై?!

2107లో సెన్సెక్స్ 28 శాతం, నిఫ్టీ 29 శాతం చొప్పున లాభాలను గడించాయి. ఈ సమయంలో అనేక స్టాక్స్ మంచి లాభఆలనుపంచాయి. అయితే, కొన్ని లార్జ్‌క్యాప్ స్టాక్స్ మాత్రం ఇండెక్స్‌లతో పోల్చితే అండర్ పెర్ఫామ్ చేశఆయి. 2017 బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లను దాటలేకపోయిన బీఎస్ఈ 100ఇండెక్స్‌లోని కొన్ని స్టాక్స్, 2018లో ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నాయి.

అపోలో హాస్పిటల్స్
డీమానిటైజేషన్ ముందు స్థాయికి అపోలో హాస్పిటల్స్ మార్జిన్స్ చేరుకున్నాయి. రాబోయే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం నాటికి నవీ-ముంబైలోని ఆస్పత్రి బ్రేక్ఈవెన్‌కు వచ్చే అవకాశం ఉంది. ఆర్ఓసీఈ ప్రకారం ఫార్మసీ బిజినెస్ 16 శాతం రాబడులు అందిస్తోంది. ఆపరేటింగ్ మార్జిన్ 4-5 శాతంగా ఉంది. 2019ఆర్థిక సంవత్సరం నాటికి మరో 265 బెడ్స్‌ను, 2022నాటికి 765 బెడ్స్‌ను పెంచే యోచనలో ఈ హాస్పిటల్ చైన్ ఉంది. దీంతో వార్షిక ఆపరేటింగ్ గ్రోత్ 20 శాతానికి పెరిగే అవకాశాలున్నాయి.

 

కోల్గోట్-పామోలివ్
హెర్బల్, ఆయుర్వేదిక్ విభాగంలో వేదశక్తి బ్రాండ్‌పై రెండు కొత్త బ్రాండ్‌లను లాంఛ్ చేయడం ద్వారా, ఈ సెగ్మెంట్లోకి కంపెనీ ప్రవేశించింది. గ్రామీణ ప్రాంతాల డిమాండ్ ఊపందుకుంటోంది. బలమైన డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, బ్రాండ్ పవర్, టూత్‌పేస్ట్ పైనే ఫోకస్ చేయడం ఈ కంపెనీకి సానుకూలం.

 

ఎన్‌టీపీసీ
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 2.6 గిగా వాట్ల థెర్మల్ కెపాసిటీ‌ ప్లాంట్లను ఇన్స్టాల్ చేయడంతో.. ఎన్‌టీపీసీ రెగ్యులర్ ఈక్విటీపై 16 శాతం అభివృద్ధి సాధించవచ్చు. గతేడాది ఇది 5 శాతంంగా మాత్రమే ఉంది. రాబోయే మూడేళ్ల పాటు ఇది కొనసాగనుండగా.. వాల్యుయేషన్ రిస్క్ ప్రకారం చూస్తే.. ప్రస్తుతం ఈ స్టాక్ ఆకర్షణీయంగా ఉంది.

 

డాబర్ ఇండియా
గ్రామీణ ప్రాంతాల్లో అధిక వినియోగం గల ప్రోడక్టులను లాంఛ్ చేస్తున్న కంపెనీ డాబర్. ఈ కంపెనీ ఆదాయంలో 45 శాతం రూరల్ మార్కెట్ నుంచే వస్తోంది. డీమానిటైజేషన్ కారణంగా వాల్యూమ్ గ్రోత్ గణనీయంగా దెబ్బతింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి అభివృద్ధి సాధిస్తున్న ఈ కంపెనీ.. 7.2 శాతం వాల్యూమ్ గ్రోత్ నమోదు చేసింది. 
వరుసగా రెండు సీజన్స్ బాగుండడం, కనీస మద్దతు ధర పెరగడం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించడంతో.. శక్తివంతమైన డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ గల డాబర్‌ఇండియాకు లాభం చేకూర్చే అంశాలుగా చెప్పవచ్చు.

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
రైట్ఆఫ్స్ కారణంగా దెబ్బ తిన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసెట్ క్వాలిటీ.. గత కొన్ని త్రైమాసికాలుగా నిలకడ సాధిస్తోంది. రాబోయే మూడేళ్లలో స్లిప్పేజెస్ 3.4 శాతం, 2 శాతం, 1.5శాతానికి తగ్గవచ్చని గోల్డ్‌మాన్ శాక్స్ అంచనా వేస్తోంది. రిటర్న్ ఆన్ అస్సెట్స్.. 100 బేసిస్ పాయింట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని చెబుతోంది. రీక్యాపిటలైజేషన్ ప్లాణ్ కూడా ఎస్‌బీఐకి సానుకూలమే.
 Most Popular