2018లో జున్‌జున్‌వాలా నమ్మకం పెట్టుకున్న స్టాక్స్

2018లో జున్‌జున్‌వాలా నమ్మకం పెట్టుకున్న స్టాక్స్

ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో కేవలం 5 స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ విలువ రూ. 9,150 కోట్లు. అంటే వీటిపై ఆయన ఎంతగా విశ్వాసం ఉంచారో అర్ధమవుతుంది. వీటిలో మూడు స్టాక్స్ గతేడాది మంచి ప్రదర్శన కనబరిచాయి. టైటాన్ కంపెనీ, ఎస్కార్ట్స్, డీహెచ్ఎఫ్ఎల్‌లు గతేడాడి 140-150 శాతం మేర లాభాలు పంచాయి. అయితే క్రిసిల్, లుపిన్‌లు మాత్రం మదుపర్లను ఆకట్టుకోలేకపోయాయి.

ఈ స్టాక్స్‌కు 2018లో పరిస్థితేంటి?
జున్‌జున్‌వాలా ఫేవరేట్ కంపెనీలలో ఒకటి టైటాన్ కంపెనీ స్టాక్‌కు.. 'స్ట్రాంగ్ బయ్' రేటింగ్ ఇచ్చాయి 9 బ్రోకరేజ్ కంపెనీలు. మరో 16 కంపెనీలు 'బయ్' రేటింగ్ ఇవ్వగా.. రెండు 'హోల్డ్' అని.. ఒక్కొక్క కంపెనీ చొప్పున 'సెల్', 'స్ట్రాంగ్ సెల్' రేటింగ్‌లను ఇచ్చాయి. 
జున్‌జున్‌వాలా, ఆయన సతీమణికి కలిపి టైటాన్‌లో రూ. 6200 కోట్లకు సమానం అయిన 8.06 శాతం వాటా ఉంది. అంచనాల ప్రకారం ఉండాల్సిన ధర కంటే కొంత తక్కువలోనే లభిస్తున్న ఈ షేర్, దీర్ఘకాలానికి కొనుగోలు చేయవచ్చని పలు బ్రోకరేజ్ కంపెనీలు సూచిస్తున్నాయి. రూ. 975 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం చివరకు ఎస్కార్ట్స్‌లో జున్‌జున్‌వాలాకు 9.16 శాతం వాటా ఉంది. దీని విలువ రూ. 870 కోట్లు. టైటాన్ అంత పాపులర్ కాకపోయినా.. రెండు కంపెనీలు స్ట్రాంగ్ బయ్ రేటింగ్‌ను.. నాలుగు బ్రోకరేజ్‌లు బయ్ రేటింగ్ను ఇచ్చాయి.

లుపిన్‌ ఇప్పటికే భారీగా పతనం అయిన స్టాక్. జున్‌జున్‌వాలా పోర్ట్‌ఫోలియోలో 2017లో వరస్ట్ పెర్ఫామెన్స్ కూడా ఈ స్టాక్‌దే. అయినా సరే 16 బ్రోకరేజ్‌ హౌస్‌లు స్ట్రాంగ్‌ బయ్, బయ్ రేటింగ్‌లు ఇవ్వడం విశేషం. జున్‌జున్‌వాలాకు ఈ కంపెనీలో రూ. 750 కోట్ల విలువైన 1.89 శాతం వాటా ఉంది.

యూఎస్ఏ మార్కెట్లో పలు ప్రొడక్టుల లాంఛింగ్‌ కోసం ఇండియన్ ఫార్మా కంపెనీలు ఎదురుచూస్తున్నాయి. ఏఎన్‌డీఏ అప్రూవల్స్ లభిస్తే చాలు, భారీగా మార్కెట్ పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ స్టాక్స్ మంచి వాల్యుయేషన్స్‌లో లభిస్తుండడంతో వీటిని కొనుగోలు చేయవచ్చని.. లుపిన్, అరబిందో ఫార్మాలను కొనుగోలు చేయవచ్చని చెబుతున్నారు. అరబిందోలో జున్‌జున్‌వాలాకు 1శాతం వాటా ఉంది.

క్రిసిల్‌కు నాలు కంపెనీలు బయ్, స్ట్రాంగ్ బయ్ రేటింగ్స్ ఇచ్చాయి. జున్‌జున్‌వాలా, ఆయన భార్య కలిసి.. ఈ కంపెనీలో 5.58  శాతం వాటాను కలిగి ఉన్నారు. దీని విలువ రూ. 750 కోట్లు. 

హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ దివాన్ హౌసింగ్‌కు 8 కంపెనీలు స్ట్రాంగ్, బయ్ రేటింగ్స్‌ను ఇచ్చాయి. ఈ కంపెనీలో జున్‌జున్‌వాలాకు 3.19 వాటా ఉంది. దీని విలువ రూ. 588 కోట్లు. 
హౌసింగ్ ఫైనాన్స్, లేదా శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్, దివాన్ హౌసింగ్ వంటి పూర్తి స్థాయి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు ప్రస్తుత లెవెల్స్‌లో ఆకర్షణీయంగా ఉన్నాయని బ్రోకరేజ్ సంస్థలు చెబుతున్నాయి.Most Popular