డాలీఖన్నా, పొరింజు, విజయ్ కేడియా స్మాల్‌క్యాప్స్ బెట్టింగ్

డాలీఖన్నా, పొరింజు, విజయ్ కేడియా స్మాల్‌క్యాప్స్ బెట్టింగ్

2017లో స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఏకంగా 60 శాతం ఊపందుకుంది. అనేక స్టాక్స్ మల్టీబ్యాగర్స్‌గా కూడా అవతరించాయి. అయితే, కొత్త సంవత్సరంలో కూడా ఈ విభాగానికి చెందిన ఎన్నో స్టాక్స్, భారీ లాభాలను గడించేందుకు అవకాశం ఉంది.
స్మాల్‌క్యాప్ సెజార్ పొరింజు వెలియాత్, విజయ్ కేడియా, డాలీ ఖన్నా వంటి ఏస్ ఇన్వెస్టర్స్.. 2018లో కొన్ని స్మాల్ క్యాప్ స్టాక్స్‌పై బెట్టింగ్ చేస్తున్నారు. 


వీరు హోల్డింగ్ చేస్తున్న వాటిలో కొన్ని స్టాక్స్ ఇప్పటికే పరుగులు తీస్తున్నాయి కూడా. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, వైభవ్ గ్లోబల్‌ షేర్లపై సూపర్ పాజిటివ్‌గా ఉన్నారు విజయ్ కేడియా. 


2017లో ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ 200శాతంపైగా పెరిగింది. ఎవరెస్ట్ ఇండస్ట్రీస్‌ను రూ. 624 టార్గెట్ ధరతో కొనుగోలు చేయవచ్చని ఎడెల్వీస్ సెక్యూరిటీస్ అంటోంది. ఒక ఏడాది ఫార్వార్డ్ పీఈతో పోల్చితే 26 శాతం డిస్కౌంట్‌కే ఈ షేర్ లభ్యమవుతోందని వెల్లడించింది. 


గత ఐదేళ్లలో వైభవ్ గ్లోబల్ షేర్ ధర 500 శాతం మేర లాభపడింది. పంజాబ్ ట్రాక్టర్స్, సెరా శానిటరీ వేర్, ఏజీస్ లాజిస్టిక్స్, అతుల్ ఆటో వంటి మల్టీబ్యాగర్స్‌ను ముందుగానే గుర్తించిన ఇన్వెస్టర్ విజయ్ కేడియా, 1989 నుంచి ఈయన మార్కెట్లలో ఉన్నారు. 

 

బటర్‌ఫ్లై గాంధీమతి అప్లయెన్సెస్, రెయిన్ ఇండస్ట్రీస్ షేర్లపై డాలీ ఖన్నా పాజిటివ్‌గా ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2వ త్రైమాసికంలో బీజీఏఎల్.. స్ట్రాంగ్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. ఆదాయంలు 29.6 శాతం పెరిగాయి. కుకర్/కుక్‌వేర్ విభాగంలో అమ్మకాలు ఊపందుకోవడమే ఇందుకు కారణం. గత మూడు నెలల కాలంలో బటర్‌ఫ్లై గాంధీమతి అప్లయెన్సెస్ షేర్ ధర 147 శాతం పెరిగింది. 

 

గతేడాది రెయిన్ ఇండస్ట్రీస్ షేర్ 680 శాతం పెరిగింది. కాల్సిన్‌డ్ పెట్ కోక్, కోల్ టార్ పిచ్‌లను తయారు చేయడంలో ప్రపంచంలోనే రెండో అతి పెద్ద కంపెనీ ఇది. అల్యూమినియం ప్రొడక్టుల ధరలు పెరగడంతో పలు చైనా కంపెనీలు ఈ విభాగం నుంచి తప్పుకోవడం ఈ కంపెనీకి బాగా కలిసొచ్చిందని చెప్పాలి. మరోవైపు కేపీఐటీ టెక్నాలజీస్ షేర్‌పై కూడా డాలీ ఖన్నా పాజిటివ్‌గా ఉన్నారు

 

2018లో టాటా కాఫీ, టాటా గ్లోబల్ బెవరేజెస్ షేర్స్‌పై బెట్టింగ్ చేస్తున్నారు పొరింజు వెలియాత్. రీస్ట్రక్చరింగ్ విధానాలు సక్సెస్ కావడం, అంతర్జాతీయంగా టీ సెగ్మెంట్‌కు డిమాండ్ పెరగడం వంటివి.. టాటా గ్లోబల్ బెవరేజెస్‌కు సానుకూల అంశాలు. 2017లో టాటా గ్లోబల్ షేర్ ధర 160 శాతం పెరగగా.. టాటా కాఫీ 49 శాతం లాభపడింది.
 Most Popular