2018లో 70 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్!

2018లో 70 శాతం వరకు రిటర్న్స్ ఇచ్చే స్టాక్స్!

2017లో నిఫ్టీ ఇండెక్స్ 29 శాతం వృద్ధిని సాధించింది. 2018లో 11వేల పాయింట్ల మార్క్‌ను అధిగమించే అవకాశాలు ఉన్నాయని ఎనలిస్ట్‌లు అంచనా వేస్తున్నారు. ఇలా జరగాలంటే 2107 స్పీడ్ ఈ ఏడాది కూడా కంటిన్యూ కావాలి. అలా జరిగేందుకు అవకాశం ఉందా అనే ప్రశ్నకు.. అవుననే సమాధానం ఇస్తున్నాయి మార్కెట్ వర్గాలు. ప్రస్తుతం మార్కెట్ జోరు చూస్తుంటే.. 2018లో కూడా 2017 స్థాయిలోనే బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు వృద్ధి సాధించవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.

ఈ ఏడాది కూడా బుల్ మార్కెట్ కొనసాగవచ్చని.. మరింతగా సంపద సృష్టి జరుగుతుందని మార్కెట్ వర్గాలు అంటున్నారు. గతేడాది కొన్ని ప్రతికూల పరిస్థితులు కనిపించినా.. చివరకు అవన్నీ సానుకూలంగా మారిన సంగతి గుర్తు చేస్తున్నారు ఎనలిస్ట్‌లు.

దీర్ఘకాలికంగా చూస్తే నిఫ్టీ 11 వేల పాయింట్లను అందుకోవడం కష్టమేమీ కాదని విశ్లేషకుల అంచనా. అయితే గతేడాది మాదిరిగా జర్నీ అంత స్మూత్‌గా ఉండకపోవచ్చని చెబుతున్నారు. మార్కెట్లలో డిప్స్ కనిపిస్తే.. దీర్ఘకాలిక దృష్టితో కొనుగోళ్లకు అవకాశం భావించాలని చెబుతన్నారు. 

1980ల నుంచి చరిత్రను గమనిస్తే.. ఒక ఏడాది 25 శాతం రాబడులు అందించిన తర్వాతి సంవత్సరం కూడా మార్కెట్లు లాభాలు కొనసాగించాయి. ఈ స్ట్రాటజీ ప్రకారం 2018లో కూడా మార్కెట్లు సానుకూలంగానే ఉండవచ్చు. ఇలాంటి సమయంలో రాబోయే 12 నెలల్లో 70 శాతం వరకు రాబడులు అందించేందుకు అవకాశం ఉన్న 10 స్టాక్స్ జాబితాను చూద్దాం.

 

ఐసీఐసీఐ డైరెక్ట్
భారతీ ఎయిర్‌టెల్: BUY| టార్గెట్ రూ. 688| రాబడులకు అవకాశం  29%
గత 10 ఏళ్లుగా రూ. 216- 452 మధ్యే ఈ స్టాక్ కన్సాలిడేట్ అవుతూ ఉంది. హెల్దీ ప్రైస్, ప్రైస్ కరెక్షన్.. తాజాగా టెలికాం రంగంలో మారుతున్న పరిస్థితులను పరిశీలిస్తే.. ఈ కరెక్షన్ ఫేజ్ పూర్తయిందని చెప్పవచ్చు. ప్రాథమికంగా అప్‌ట్రెండ్ ప్రారంభం కావడం, స్ట్రాంగ్ వాల్యూమ్‌‌తో బ్రేకవుట్ రావడంతో ర్యాలీ సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలున్నాయి.

 

యాక్సిస్ బ్యాంక్: BUY| టార్గెట్ రూ. 640| రాబడులకు అవకాశం 14%
గత 9 నెలలు గా రూ. 547-480 స్థాయిల మధ్య ఈ స్టాక్ కన్సాలిడేషన్‌కు గురవుతోంది. తాజాగా ఈ ఫేజ్ నుంచి బ్రేకవుట్ చేరువకు వచ్చింది. కన్సాలిడేషన్ ముగిసిందని.. ఈ స్టాక్‌లో అప్‌ట్రెండ్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

 

పంజాబ్ నేషనల్ బ్యాంక్: BUY| టార్గెట్ రూ. 230| రాబడులకు అవకాశం 34%
పీఎన్‌బీ స్టాక్‌లో కరెక్షన్ దశ ముగింపునకు వచ్చింది. గత 7 ఏళ్ల పాటు కరెక్షన్‌కు గురయిన ఈ స్టాక్.. డౌన్‌వార్డ్ స్లోపింగ్ ఛానల్‌ను ఫామ్ చేసింది. గత ఏడేళ్ల ట్రెండ్‌కు ఈ ఏడాది బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయని.. ఛార్టిస్టులు చెబుతున్నారు. గత లెవెల్స్‌ ప్రకారం చూసుకుంటే.. ఈ స్టాక్‌లో ర్యాలీ కనిపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

 

టాటా కెమికల్స్: BUY| టార్గెట్ రూ. 878| రాబడులకు అవకాశం 20%
గతేడాది జనవరి-మార్చ్ కాలంలో టాటా కెమికల్ షేర్‌లో మల్టీ-ఇయర్ బ్రేకవుట్ వచ్చింది. 1996నాటి స్థాయిని, 2008 జనవరి నాటి హై లెవెల్‌ను అధిగమించగలిగింది. ఈ బ్రేకవుట్ తర్వాత ఈ ర్యాలీని కంటిన్యూ చేసిన టాటా కెమికల్స్ షేర్.. ఇంకా ఈ ట్రెండ్‌ను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

ఈఐహెచ్: BUY| టార్గెట్ రూ. 183| రాబడులకు అవకాశం 24%
గతేడాది ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో అప్పర్‌బ్యాండ్‌లో బ్రేకవుట్ తీసుకున్న ఈ స్టాక్. హైయర్ లెవెల్స్‌లో కన్సాలిడేషన్‌కు గురి కావడమే కాకుండా.. ఈస్థాయిలో మూడు నెలల పాటు కొనసాగి ఫ్రెష్ ఎంట్రీకి అవకాశాలను క్లపిచింది. డిసెంబర్ 2016నాటి లెవెల్స్‌తో పోల్చితే రీబౌండ్ అయిన ఈ స్టాక్‌లో ర్యాలీ కనిపించే అవకాశాలు ఉన్నాయి.

 

సిస్టమాటిక్స్ షేర్స్
అదాని ఎంటర్‌ప్రైజెస్: BUY| టార్గెట్ రూ. 261| రాబడులకు అవకాశం 57%
కంటిన్యుయేషన్ ప్యాటర్న్ అయిన కప్ హ్యాండిల్ బ్రేకవుట్‌ను ఫామ్ చేయడంతో.. 2017నాటి హైయర్ లెవెల్స్‌ను బ్రేక్ చేసి.. అప్ ట్రెండ్‌ను నమోదు చేయవచ్చని టెక్నికల్ ఎనలిస్ట్‌లు చెబుతున్నారు. రాబోయే 12 నెలల్లో రూ. 261 స్థాయిని ఈ స్టాక్ అందుకోవచ్చని అంటున్నారు.

 

టాటా పవర్: BUY| టార్గెట్ రూ. 135| రాబడులకు అవకాశం 45%
మంత్లీ ఛార్టుల ప్రకారం ఈ స్టాక్ ట్రయాంగిల్ బ్రేకవుట్ తీసుకుని.. రీసెంట్‌గా అప్‌మూవ్ ప్రారంభించుకుంది. రూ. 120 స్థాయిని అధిగమించిన తర్వాత.. రూ. 135 లెవెల్‌వరకూ  పెరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుత లెవెల్స్‌ను కొనుగోలుకు అవకాశం భావించాలని ఎనలిస్ట్‌లు సూచిస్తున్నారు. రూ. 78 లెవెల్‌ను స్టాప్‌లాస్‌గా పరిగణించాలి.

 

ఏబీబీ ఇండియా: BUY| టార్గెట్ రూ. 1900| రాబడులకు అవకాశం 35%
రూ. 1300 లెవెల్స్ వద్ద మల్టిపుల్ బాటమ్స్ ఫామ్ చేసిన ఈ స్టాక్.. ట్రయాంగిల్ బ్రేకవుట్ తీసుకుంది. రూ. 1700 వరకూ ఈ స్టాక్ పెరిగే అవకాశం ఉండగా.. ఆ స్థాయికి ఎగువన స్థిరంగా ఉంటే రూ. 1900 కూడా అందుకోవచ్చు. రూ. 1300దిగువన స్టాప్‌లాస్ ఉండాలి.

 

ఎల్‌కాన్ ఇంజినీరింగ్: BUY| టార్గెట్ రూ. 180| రాబడులకు అవకాశం 76%
2009 నుంచి ఈ స్టాక్ నిర్ణీత రేంజ్‌లోనే ట్రేడవుతోంది. రూ. 101వద్ద బ్రేవుట్ తీసుకుని.. మత్లీ, క్వార్టర్లీ, ఇయర్లీ బ్రేకవుట్ లెవెల్స్‌ ఎగువకు చేరుకుంది. ఈ స్టాక్ రూ. 180వరకూ పెరిగే అవకాశ ఉండగా.. రూ. 80ని స్టాప్‌లాస్‌గా పరిగణించాలి.

 

హెక్సావేర్: BUY| టార్గెట్ రూ. 430| రాబడులకు అవకాశం 26%
కంటిన్యుయేషన్ పాటర్న్ అయిన పోల్ అండ్ ఫ్లాగ్ బ్రేకవుట్ ప్యాటర్న్‌ను హెక్సావేర్ ఫామ్ చేసింది. రూ. 345 ఎగువన బ్రేకవుట్ వస్తే రూ. 430వరకూ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే రూ. 314 లెవెల్‌ను స్టాప్‌లాస్‌గా పరిగణించాలి.

 

గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇవ్వబడిన రికమెండేషన్స్‌ను ఆయా సంస్థల రీసెర్చ్ రిపోర్ట్‌ల నుంచి తీసుకోవడం జరిగింది. ఈ రికమెండేషన్స్‌కు ప్రాఫిట్‌యువర్‌ట్రేడ్.ఇన్ బాధ్యత వహించదు. పెట్టుబడులు చేసేందుకు ముందు మార్కెట్ నిపుణులను సంప్రదించండి.Most Popular