2017లో ఎంట్రీ..ఈ ఏడాదిలో లాభాలు

2017లో ఎంట్రీ..ఈ ఏడాదిలో లాభాలు

2017లో స్టాక్‌మార్కెట్లలో ప్రవేశించిన కొన్ని ఐపిఓలు బాగా లాభాలు తెచ్చిపెట్టిన సంగతి గత కథనాల్లో చెప్పుకున్నాం. కానీ వాటిలో కొన్ని ఐపిఓలు లాభాలు పంచలేదు..అలాంటివి కొన్ని ఈ కొత్త సంవత్సరంలో బాగా లాభాలు పంచుతాయని అనలిస్టులు చెప్తున్నారు.వాటిలో కొన్ని చూద్దాం
కొచ్చిన్ షిప్‌యార్డ్
షిప్ బిల్డింగ్, మరమ్మత్తుల రంగంలో కొచ్చిన షిప్‌యార్డ్ లాభాలబాటలో పయనిస్తున్న సంస్థ. రూ. 228కోట్ల అప్పున్న ఈ సంస్థ నగదు నిల్వ చూస్తే రూ. 2వేలకోట్లుగా నమోదు అయ్యాయి. రక్షణ రంగంతో పాటు భారీ వెస్సెల్స్ ‌పై దృష్టి పెట్టింది. రూ. 5400కోట్ల యాంటి సబ్ మెరైన్ షిప్ ప్రాజెక్టులో అతి తక్కువ ధర కోట్ చేసిన సంస్థగా కొచ్చిన్ షిప్‌యార్డ్ ఆవిర్భవించడం విశేషం. దీంతో కొచ్చిన్ షిప్‌యార్డ్ ఆర్డర్ విలువ రూ.2600కోట్లకి చేరింది

హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ
సురక్షిత పాలసీల రంగంలో తిరుగులేని ఆధిపత్యం వహిస్తోంది. విశాలమైన పంపిణీ వ్యవస్థ, ఇతర సంస్థలతో విక్రయ ఒప్పందాలు సంస్థకి అదనపు అర్హతలు బీమా ఉత్పత్తులతోపాటు ఇతర పొదుపు పథకాల మేళవింపుతో హెచ్‌డిఎఫ్‌సి స్టాండర్డ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వినియోగదారులలో మంచి గుర్తింపు కలిగి ఉంది దీంతో రానున్న త్రైమాసికాలలో మంచి ఆదాయం ఆర్జించి షేరు ధర బాగా పెరుగుతుందని అంచనా

గోద్రెజ్ ఆగ్రోవెట్
జంతువుల ఆహారం, వ్యవసాయసంబంధిత ఉత్పత్తుల రంగంలో వ్యాపారం చేస్తోన్న సంస్థలు చాలా తక్కువ. ఐతే ఈ రకమైన ఉత్పత్తుల అమ్మకాలు లాభదాయకత, రాబడికి మాత్రం ఎక్కువ అవకాశం ఉంది. గోద్రెజ్ ఆగ్రోవెట్ వ్యాపారంలో 53శాతం జంతువుల ఆహారం విక్రయాల ద్వారానే వస్తుంది. ఇక స్టాక్ మార్కెట్లలో అయితే వేరే సంస్థ లేదు కూడా!  షేర్లు, అప్పుల నిష్పత్తి అయితే 0.7 శాతం. అందుకే రానున్న రోజుల్లో ఈ సంస్థ షేర్లు కూడా మంచి రాబడినిస్తాయని వ్యాపార విశ్లేషకుల అంచనా

ఎస్.చాంద్& కంపెనీ
విద్యారంగంలోని పుస్తకాల ప్రచురణ రంగంలో ఉన్న ఎస్ చాంద్ 9500 పుస్తకాలతో భారీ కేటలాగ్ నిర్వహిస్తోన్న చరిత్ర సొంతం. ఎస్ చాంద్‌ పంపిణీ వ్యవస్థ కూడా 6500 మంది పంపిణీదారులతో తన వ్యాపారం నిర్వహిస్తోంది. ప్రవేట్ పాఠశాలలు విద్యారంగంపై పెట్టే ఖర్చు ఎక్కువ అవుతుండటం ఈ సంస్థకి ప్రయోజనకారి కాగలదు అలానే డిజిటల్ రంగంలో కూడా నిధులను ఖర్చు పెట్టడం సంస్థ వ్యాపార పురోగతికి దోహదపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు

సెక్యూరిటీ & ఇంటలిజెన్స్ సర్వీసెస్
ఎస్ఐఎస్ లిస్టెడ్ కంపెనీల్లో అతి పెద్ద రక్షణ సేవలు అందిస్తున్న సంస్థ.  రక్షక భటులకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపధ్యంలో ఈ సంస్థ వ్యాపారం బాగా పెరుగుతుందని అంచనా. వస్తువు, సేవల పన్ను అమలు తర్వాత  వ్యవస్థీకృత రక్షణ సంస్థల సేవలకు ఎక్కువ వ్యాపార అవకాశాలు పెరిగాయి. అలా సెక్యూరిటీ అండ్  ఇంటలిజెన్స్ సర్వీసెస్ షేరు పెరుగుదలకి దోహదపడుతుందని చెప్తున్నారు

( పై స్టాక్స్‌పై చేసే లావాదేవీలకు సైట్ బాధ్యత వహించజాలదు)Most Popular