ఆస్ట్రన్ పేపర్‌ లిస్టింగ్‌ భల్లేభల్లే!

ఆస్ట్రన్ పేపర్‌ లిస్టింగ్‌ భల్లేభల్లే!

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ పూర్తిచేసుకున్న ఆస్ట్రన్‌ పేపర్‌ అండ్‌ బోర్డ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో భారీ లాభం(ప్రీమియం)తో లిస్టయ్యింది. ఇష్యూ ధర రూ. 50 తో పోలిస్తే బీఎస్‌ఈలో రూ. 115 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభమైంది. ఇది 130 శాతం అధికంకాగా.. ప్రస్తుతం 139 శాతం లాభంతో రూ. 120 వద్ద కదులుతోంది. ఇది ఇంట్రాడే గరిష్టంకాగా.. రూ. 113 వద్ద కనిష్టాన్ని చవిచూసింది.
భారీ స్పందన
రూ. 45-50 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూలో భాగంగా ఆస్ట్రన్‌ పేపర్‌ 1.4 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా.. 340 కోట్లకుపైగా షేర్లకోసం బిడ్స్‌ దాఖలయ్యాయి. ఈ నెల మూడో వారంలో ముగిసిన ఇష్యూ 243 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. గత రెండు వారాలుగా ఐపీవోలు లేకపోవడం.. దీనికితోడు చిన్న ఇష్యూ కావడంతో ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఐపీవో తరువాత కంపెనీలో ప్రమోటర్ల వాటా 66 శాతం నుంచి 46 శాతానికి క్షీణించింది.
కంపెనీ వివరాలివీ
2010లో ప్రారంభమైన ఆస్ట్రన్‌ పేపర్‌ అండ్‌ బోర్డ్స్‌ గుజరాత్‌లోని హాల్వద్‌వద్ద తయారీ ప్లాంటును నెలకొల్పుకుంది. వార్షికంగా 96,000 మిలియన్‌ టన్నుల పేపర్‌ తయారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.Most Popular