హైదరాబాద్‌లో సురినామ్‌ కాన్సులేట్‌ 

హైదరాబాద్‌లో సురినామ్‌ కాన్సులేట్‌ 

దక్షిణ అమెరికాలోని సురినామ్‌.. హైదరాబాద్‌లో తన కాన్సులేట్‌ కార్యాలయాన్ని జూబ్లీహిల్స్‌లో ప్రారంభించింది.  విద్య, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను ఇరు దేశాల మధ్య పెంపొందించడానికి ఈ కార్యాలయం దోహదపడుతుందని సురినామ్‌ హానరరీ కాన్సుల్‌ అసిఫ్‌ ఇక్బాల్‌ తెలిపారు. నాణ్యమైన, ఎక్కువకాలం మన్నే కలపకు సురినామ్‌ పేరుగాంచిందన్నారు. టింబర్‌ దిగుమతిదారుల నుంచి ఇప్పటికే మంచి స్పందన లభిస్తోందని ఆయన తెలిపారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో ఫర్నీచర్‌ కారిడార్‌ ఏర్పాటుకు ప్రతిపాదించామని తెలిపారు. దీని ద్వారా టింబర్‌ను సురినామ్‌ నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడి సెంటర్‌లో డిజైనింగ్‌ చేస్తారని, ఈ సెంటర్‌ ద్వారా 300 మందికి శిక్షణ ఇచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇక్కడ తయారైన ఫర్నీచర్‌ను లాటిన్‌ అమెరికాకు ఎగుమతి చేసే అవకాశం ఉందని, ఫలితంగా ఎక్కువ మార్జిన్లు లభిస్తాయని తెలిపారు. బెంగళూరులో ఏర్పాటు చేస్తున్న ఫర్నీచర్‌ కారిడార్‌ మూడు నెలల్లో ప్రారంభం అవుతుందని, హైదరాబాద్‌లోని సెంటర్‌ ఏర్పాటు ఆరు నెలలు పడుతుందన్నారు.Most Popular