ఇ-కామర్స్‌ను ఎస్‌ఎంఈలు అందిపుచ్చుకోవాలి

ఇ-కామర్స్‌ను ఎస్‌ఎంఈలు అందిపుచ్చుకోవాలి

మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా చిన్న, మధ్య స్థాయి కంపెనీలు డిజిటల్ టెక్నాలజీని అందిపుచ్చుకోని, ఈ కామర్స్ విభాగంలోకి ప్రవేశించాలని తెలంగాణ సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటీ) శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తెలిపారు. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ చాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టాప్సీ) శతజయంత్యుత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యంలో ‘ఇ-కామర్స్‌, వ్యాపార అవకాశాలు’ అనే అంశంపై ఏర్పాటు చేసిన సెమినార్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు . కొంత మందికి సరైన అవగాహన లేకపోవడం, అధిక వ్యయం అవుతున్న భావనతో ఆన్‌లైన్‌లో విక్రయాలకు దూరంగా ఉంటున్నారని పేర్కొన్నారు. ఎస్‌ఎంఈలకు నిపుణులు విలువైన సూచనలు ఇచ్చి ఇ-కామర్స్‌ రంగంలోకి అడుగు పెట్టేలా చేయాలని కోరారు. ఇ-కామర్స్‌పైలో కొంత మంది భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. ఈ నేపథ్యంలో పటిష్ఠమైన భద్రత కల్పించడానికి కంపెనీలు వినూత్న ఉత్పత్తులను అభివృద్ధి చేస్తున్నాయన్నారు. సైబర్‌ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోందన్నారు. ఏప్రిల్‌లో ఐటీ విధానంతోపాటు మరో నాలుగు విధానాలను విడుదల చేసిన ప్రభుత్వం సెప్టెంబరులో సైబర్‌ భద్రత, డేటా విశ్లేషణ, ఓపెన్‌ డేటాలపై విధానాలను ప్రకటించనుందని చెప్పారు.
 Most Popular