సరికొత్త ఫీచర్లతో ఒపేరా బ్రౌజర్

సరికొత్త ఫీచర్లతో ఒపేరా బ్రౌజర్

ఒకప్పుడు నెట్ జనులు ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్ , నెక్స్ కేప్ నావిగేటర్ వంటివి ఇంటర్నెట్ బ్రౌసింగ్ కోసం వాడేవాడు. ఇప్పుడు మొజిల్లా ఫైర్ ఫాక్స్ , క్రోమ్ తో పాటు ఒపేరా కూడా ఎక్కువగా వాడుతున్నారు నెటిజన్లు. డౌన్ లోడ్స్ కాదు ... జస్ట్ బ్రౌస్ చేస్తే చాలు ... బోలెడంత డేటా అయిపోతోంది. ఇక వీడియోస్ కానీ చుశామా అంతే సంగతులు.. జీబిలకు జీబిలు డేటా నిముషాల్లో లేచిపోతోంది. కానీ ఒపేరా మినీ తో ఇలాంటి ప్రాబలెమ్స్ అన్నింటికి చెక్  పెట్టోచ్చంటోంది ఆ సంస్ధ.   ఎన్ని బ్రౌజర్స్ ఉన్నా..ఒపేరా మినీతో ఇంటర్నెట్ డాటా ఎక్కువగా ఆదా అవుతుందన్నారు ఒపెరా డిప్యూటి సీటీఓ బ్రూస్ లాసెన్ ఫేస్ బుక్, యూట్యూబ్, ట్విట్టర్ లాంటివే కాకుండా...ఎడ్యుకేషన్, జాబ్స్ సర్చింగ్ యాప్స్ కి అప్లికేషన్ కి ఓపెరాను ఎక్కువగా వాడుతున్నారని చెప్పారు.  ఓపెరాతో ఒక్క బ్రౌజింగే కాదు...ఆన్ లైన్ బిజినెస్ కూడా నాలుగేళ్లలో 40శాతం పెరిగిందన్నారు...ఆ సంస్థ ప్రతినిధులు. ఇండియా మొబైల్ తయారిల్లో లావా, సెల్కాన్, మైక్రో మ్యాక్స్ ఇలాంటి కంపేనీల స్మార్ట్ ఫోన్స్ లో  డీ ఫల్ట్ ల్లో  ఒపేరా బ్రౌసర్ ని అందిస్తున్నమని ... ఇందుకోసం ఆయా సంస్ధలతో తమకు ఒప్పందం ఉందని సంస్ధ చెప్తోంది.అప్ గ్రేడ్ అవుతున్న టెక్నాలజీతో ఒపేరా అప్ గ్రేట్ అవుతూ సంస్ధ మార్కెట్ ను పెంచుకోంటోంది. భారత్‌లోని నెట్ యూజర్ల వాడకానికి అనుగుణంగా త్వరలో తమ బ్రౌజర్‌లో వీపీఎన్ తదితర ప్రత్యేక ఫీచర్లు ప్రవేశపెట్టనున్నట్లు ఒపెరా సంస్థ డిప్యుటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ బ్రూస్ లాసన్ తెలిపారు. ఒపెరా మినీ మొబైల్ బ్రౌజర్‌లో తాము ఉపయోగిస్తున్న టెక్నాలజీ.. డేటాను 90 శాతం మేర కుదించేస్తుందని వివరించారు. ఫలితంగా దేశీ యూజర్లకు గత ఏడాది వ్యవధిలో సుమారు 36 వేల టెరాబైట్ల డేటా, రూ. 690 కోట్ల మేర డేటా చార్జీలు ఆదా అయ్యాయని  లాసన్ తెలిపారు. ప్రస్తుతం తమ బ్రౌజర్‌కు భారత్‌లో సుమారు 5 కోట్ల మంది పైచిలుకు యూజర్లు ఉన్నారని చెప్పారు. బ్రౌజర్లో తెలుగు సహా 13 భాషల్లో తోడ్పాటు అందిస్తున్నామన్నారు. దేశీయంగా మినీ యూజర్లలో సింహభాగం సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు, వార్తల సంబంధిత సైట్లను సందర్శిస్తున్నట్లు లాసన్ చెప్పారు.Most Popular