ఫ్యూచర్‌ సప్లై చైన్‌ లిస్టింగ్‌ సోమవారం!

ఫ్యూచర్‌ సప్లై చైన్‌ లిస్టింగ్‌ సోమవారం!

ఇటీవలే పబ్లిక్‌ ఇష్యూ పూర్తి చేసుకున్న లాజిస్టిక్స్‌ రంగ సంస్థ ఫ్యూచర్‌ సప్లై చైన్‌ సొల్యూషన్స్‌ స్టాక్‌ ఎక్స్చేంజీలలో సోమవారం(18l) లిస్ట్‌కానుంది. ఈ నెల8న ముగిసిన ఇష్యూకి 7.4 రెట్లు అధికంగా స్పందన లభించింది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 660-664 కాగా.. తద్వారా కంపెనీ రూ. 650 కోట్లను సమీకరించింది. ఈ ఐపీవో ద్వారా బిగ్‌ బజార్‌ స్టోర్ల కిశోర్‌ బియానీ గ్రూప్‌ నుంచి మరో సంస్థ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌కానుంది. ఐపీవో నిధుల్లో రూ. 150 కోట్లు మాతృ సంస్థ ఫ్యూచర్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు లభించనుండగా.. మరో రూ. 350 కోట్లు కంపెనీలో మొదట్లో ఇన్వెస్ట్‌చేసిన గ్రిఫిన్‌ పార్టనర్స్‌కు దక్కనున్నాయి.
యాంకర్‌ నిధులు
ఐపీవోలో భాగంగా ఫ్యూచర్‌ సప్లై చైన్‌ ఈ నెల 5న 16 యాంకర్‌ ఇన్వెస్టర్‌ సంస్థల నుంచి రూ. 195 కోట్లను సమీకరించింది. షేరుకి రూ. 664 ధరలో 2.93 మిలియన్‌ షేర్లను విక్రయించింది. కంపెనీ ఐటీ ఆధారిత వేర్‌హౌసింగ్‌, పంపిణీ, తదితర లాజిస్టక్‌ సేవలను అందిస్తోంది. ఈ రంగంలో ఇటీవలే మహీంద్రా గ్రూప్‌ సంస్థ మహీంద్రా లాజిస్టిక్స్‌ స్టాక్‌ ఎక్సేంజీలలో లిస్టయ్యింది. Most Popular