డీఐసీ ఇండియా దూకుడు!

డీఐసీ ఇండియా దూకుడు!

విక్రయానికి ఉంచిన వినియోగంలోలేని భూమిని కొనుగోలు చేసేందుకు తగిన పార్టీ లభించినట్లు వెల్లడించడంతో ప్రింటింగ్‌, పబ్లిషింగ్‌, ప్యాకేజీ పరిశ్రమలకు అవసరమయ్యే ఇంకులు, రసాయనాల తయారీ సంస్థ డీఐసీ ఇండియా కౌంటర్‌కు భారీ డిమాండ్ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ప్రస్తుతం బీఎస్‌ఈల్  ఈ షేరు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 98 పెరిగి రూ. 587 వద్ద ట్రేడవుతోంది. కంపెనీ చేతిలో 12,830 చదరపు మీటర్ల మిగులు భూమిని కలిగి ఉంది.Most Popular